Loading...
Maha Shivratri: మహా శివరాత్రి పూజ ఎప్పుడు? తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే!
మహా శివరాత్రి పూజ ఎప్పుడు? తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే!

Maha Shivratri: మహా శివరాత్రి పూజ ఎప్పుడు? తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2026
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

మహా శివరాత్రి అనగానే భక్తులంతా ప్రత్యేక భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఇంట్లో దీపం వెలిగించిన అనంతరం తప్పనిసరిగా ఈ మంత్రాలను జపించాలని పండితులు సూచిస్తున్నారు. "జ్వాలాయ నమ:, జ్వలలింగాయ నమ:, ఆత్మాయ నమ:, ఆత్మలింగాయ నమ:, పరమాయ నమ:, పరమలింగాయ నమ:" ఈ మూడు మంత్రాలను భక్తిశ్రద్ధలతో జపిస్తే శివానుగ్రహం లభించి ఆత్మసాక్షాత్కారం వైపు అడుగులు వేయవచ్చని విశ్వాసం.

Details

మహా శివరాత్రి ప్రాధాన్యం

శివరాత్రి అర్థరాత్రి సమయంలో పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో శివ బ్రహ్మదేవుడు, విష్ణు మధ్య ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి.

చీకటిలో వెలుగులా అగ్నిలింగం రూపంలో దర్శనమివ్వడం వెనుక గొప్ప సందేశం ఉంది. శరీరం చీకటి వంటిది, లోపల ఉన్న ఆత్మ వెలుగు వంటిది.

శరీర రూపమైన చీకటిలో ఆత్మ రూపమైన వెలుతురును దర్శించమనే బోధనే శివరాత్రి సందేశం అని పండితులు వివరిస్తున్నారు. "ఆత్మే సాక్షాత్తు భగవత్ స్వరూపం" అన్న సత్యాన్ని తెలుసుకోవాలని శివుడు మనందరికీ సూచిస్తున్నాడని భావిస్తారు.

అందుకే ఈ పవిత్ర రోజున పై మంత్రాలను తప్పనిసరిగా జపించాలని చెబుతారు. శివుడు భక్తులకు త్వరగా అనుగ్రహం ప్రసాదించే దేవుడిగా ప్రసిద్ధి.

Details

శివరాత్రి రోజున పాటించాల్సిన నియమాలు

సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేయాలి.

కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఉండాలి.

ఎవరితో మాట్లాడినా "శివ శివ" అని సంభాషించాలి.

గురువును పూజించి, గురుపాదాలకు నమస్కారం చేయాలి.

భస్మధారణ తప్పనిసరి - పురుషులు తడి విభూది, స్త్రీలు పొడి విభూది ధరించాలి.

నుదిటి, వక్షస్థలం, భుజాలు, నాభి ప్రాంతాల్లో విభూది ధరించాలి.

తెలుపు రంగు వస్త్రాలే ధరించాలి.

ADVERTISEMENT

Details

శివరాత్రి రోజున పూజ విధానం

పార్ధివ లింగ పూజ ఎంతో శ్రేష్ఠమైనది. అంటే మట్టితో చేసిన శివలింగాన్ని పూజించడం మంచిది.

మట్టిలో కొద్దిగా ఆవుపేడ కలిపి తయారు చేసిన లింగం అయితే ఇంకా ఉత్తమం.

పూజ పూర్తయ్యాక మరుసటి రోజు ఆ లింగాన్ని నదిలో నిమజ్జనం చేయాలి లేదా మొక్కల వద్ద ఉంచాలి.

మట్టి లింగంతో పూజ చేయలేనివారు ఏ శివలింగానికైనా పూజ చేయవచ్చు.

శివరాత్రి రోజు మారేడు చెట్టుకు ప్రత్యేక శక్తి ఉంటుందని నమ్మకం. మారేడు చెట్టు వద్ద ఆవుపాలతో చేసిన పాయసం శివభక్తుడికి ఇవ్వడం శ్రేయస్కరం.

మారేడు చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మరణానంతరం కైలాస ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.

ADVERTISEMENT

Details

పూజకు ఉత్తమ సమయం

శివరాత్రి సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పవిత్రమైన సమయంగా భావిస్తారు.

ఫిబ్రవరి 15 ఆదివారం సాయంత్రం నుంచి ఫిబ్రవరి 16 ఉదయం 6 గంటల మధ్య చేసే శివపూజకు ప్రత్యేక ఫలితం ఉంటుంది.

అందులో ముఖ్యంగా అర్థరాత్రి 12 గంటల సమయంలో ఉండే "లింగోద్భవ కాలం" అత్యంత పవిత్రమైనది.

రాత్రి 12 నుంచి 12:40 మధ్య శివుడికి అభిషేకం లేదా పూజ చేస్తూ "శివాయ గురవే నమ:" అని జపిస్తే శివానుగ్రహానికి పాత్రులవుతారని పండితులు చెబుతున్నారు.

ADVERTISEMENT