Teddy Day 2025: మీ ప్రియమైన వ్యక్తికి టెడ్డీ బహుమతి ఇచ్చే ముందు - ప్రతి రంగు టెడ్డీకి అర్ధమేంటో తెలుసుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రేమికులు ఎంతో ఆనందంగా వాలెంటైన్స్ వీక్‌ను జరుపుకుంటున్నారు. ఈ వారంలో నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా టెడ్డీ డేని జరుపుకుంటారు.
ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికులు ఒకరికొకరు టెడ్డీ బేర్‌లను బహుమతిగా ఇస్తారు, ఎందుకంటే టెడ్డీ ప్రేమను వ్యక్తీకరించే ఒక అందమైన గుర్తుగా పరిగణించబడుతుంది.
మీరు కూడా మీ భాగస్వామికి టెడ్డీని బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నారా?
అంతకంటే ముందు, ఏ రంగు టెడ్డీకి అర్ధమేంటో తెలుసుకొని , దాన్ని బహుమతిగా ఇవ్వండి. గులాబీలాగానే టెడ్డీ బేర్ రంగులకు కూడా ప్రత్యేకమైన అర్థం ఉంటుంది.
వివరాలు
నీలం రంగు టెడ్డీ బేర్
మీరు బ్లూ టెడ్డీని బహుమతిగా ఇస్తే, మీ భాగస్వామిపై మీరు చాలా ప్రేమ, గౌరవం కలిగి ఉన్నట్టు సూచిస్తుంది. ఇది మీ ప్రియమైన వ్యక్తికి మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియజేయడానికి ఒక అందమైన మార్గం.
ఆకుపచ్చ రంగు టెడ్డీ బేర్
మీరు ఆకుపచ్చ టెడ్డీని బహుమతిగా ఇస్తే, మీ ప్రియమైన వ్యక్తి మీద మీకు అత్యంత అభిమానమున్నట్టు, ప్రగాఢ ప్రేమ ఉన్నట్టు అర్థం. మీరు ఎవరినైనా నిజంగా ఇష్టపడితే, టెడ్డీ డే రోజున వారికి ఆకుపచ్చ రంగు టెడ్డీని ఇవ్వడం సరైన ఎంపిక.
వివరాలు
ఎరుపు టెడ్డీ బేర్
ఎరుపు రంగు ఎప్పుడూ ప్రేమకు ప్రతీక. ఈ ప్రత్యేకమైన రోజున మీ ప్రియమైన వ్యక్తికి మీ ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటే, రెడ్ టెడ్డీ బహుమతిగా ఇవ్వండి. ఎర్ర గులాబీలకు ఉన్న ప్రాముఖ్యత ఎంతటిదో, రెడ్ టెడ్డీకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.
గులాబీ (పింక్) టెడ్డీ బేర్
మీరు పింక్ టెడ్డీని బహుమతిగా ఇస్తే, అది మీరు ఆ వ్యక్తిని డేటింగ్‌కు ఆహ్వానించాలనుకుంటున్నారని సూచిస్తుంది.
మీరు ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమిస్తే, వారిని మీతో డేటింగ్‌కు ఆహ్వానించాలనుకుంటే, వారికి పింక్ టెడ్డీ బహుమతిగా ఇవ్వండి. వారు అంగీకరిస్తే, వారు మీ టెడ్డీని స్వీకరిస్తారు.
వివరాలు
ఆరెంజ్ టెడ్డీ బేర్
ఆరెంజ్ రంగు ఆనందం, సృజనాత్మకత, ఉల్లాసాన్ని ప్రతిబింబిస్తుంది. మీరు ఎవరినైనా ప్రేమలో ప్రతిపాదించాలనుకుంటే, వారికి ఆరెంజ్ టెడ్డీని బహుమతిగా ఇవ్వడం ఉత్తమ ఎంపిక.
తెలుపు టెడ్డీ బేర్
మీరు వైట్ టెడ్డీని బహుమతిగా ఇస్తే, మీరు ఇప్పటికే మరొకరిని ప్రేమిస్తున్నారని, కొత్త ప్రేమను అంగీకరించలేరని సూచిస్తుంది. ఈ టెడ్డీ ఆ వ్యక్తితో కేవలం స్నేహం మాత్రమే కొనసాగించాలనే సంకేతాన్ని అందిస్తుంది.
పసుపు టెడ్డీ బేర్
పసుపు రంగును సాధారణంగా సానుకూలతతో అనుసంధానిస్తారు, కానీ పసుపు టెడ్డీని బహుమతిగా ఇస్తే, మీరు మీ భాగస్వామితో విడిపోవాలని భావిస్తున్నారని అర్థం.
వివరాలు
గోధుమ రంగు (బ్రౌన్) టెడ్డీ బేర్
బ్రౌన్ టెడ్డీలు సాధారణంగా విరివిగా లభిస్తాయి. అయితే, బ్రౌన్ టెడ్డీని బహుమతిగా ఇస్తే, మీ భాగస్వామి వల్ల మీ గుండె ముక్కలైనట్టు అర్థం.
ఊదా (పర్పుల్) టెడ్డీ బేర్
మీరు పర్పుల్ టెడ్డీని బహుమతిగా ఇస్తే, అది మీ భాగస్వామితో మీరు విడిపోవాలనుకుంటున్నట్టు సూచిస్తుంది. మీ సంబంధం ముగుస్తున్న సంకేతంగా దీనిని పరిగణించవచ్చు.