అమెరికా వాసులు ఇష్టపడే విప్డ్ క్రీమ్ రెసిపీస్ ఇంట్లోనే తయారు చేసుకోండి
జనవరి 5వ తేదీన అమెరికాలో జాతీయ విప్డ్ క్రీమ్ డేని జరుపుకుంటారు. విప్డ్ క్రీమ్ అంటే మెత్తటి క్రీమ్ అని అర్థం. భారతదేశ ప్రజలకు అమెరికాతో సంబంధాలు ఎక్కువ కాబట్టి అక్కడి ఆహారాలను రుచి చూడాలనే కోరిక ఉంటుంది. అందుకే కొన్ని విప్డ్ క్రీమ్ రెసిపీలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. స్ట్రాబెర్రీ కేక్ తో విప్డ్ క్రీమ్ : పాలు, వెన్న, చక్కెర ఇంకా మీకు కావాల్సిన పిండిని తీసుకుని అన్నింటినీ కలిపి ఒక ముద్దలాగా తయారు చేయండి. ఆ తర్వాత ఒక 10నిమిషాలు ఓవెన్ లో వేడి చేయండి. తర్వాత గ్రైండర్ లో వేస్తే క్రీమ్ లాగా తయారవుతుంది. ఆ తర్వాత స్ట్రాబెర్రీతో కేక్ తయారు చేసుకుని క్రీమ్ తో తినండి.
మరికొన్ని విప్డ్ క్రీమ్ రెసిపీస్
హాట్ చాక్లెట్: ఒక పాత్రలో చక్కెర, నీళ్ళు, కోకో పౌడర్ ని కలిపి స్టవ్ మీద ఉంచాలి. తక్కువ మంటను ఉపయోగించి ఆ పాత్రలోని మిశ్రమం కొంచెం చిక్కగా అయ్యే వరకు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చాక్లెట్ సాస్ ని చిక్కటి ద్రవంలో కలిపి వేయించాలి. వేనీలా ఫ్లేవర్ పదార్థాలను కలుపుకుని స్టవ్ మీద నుండి తీసివేసి కప్పుల్లో ఆ ద్రావణాన్ని పోసి, క్రీమ్ తో పాటు హ్యాపీగా సేవించండి. అరటిపండుతో తయారీ: అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక పాత్రలో ఉంచుకోవాలి. మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్స్ ని వీటిని కలపాలి. ఆ తర్వాత విప్డ్ క్రీమ్ తీసుకుని అరటి పండు మీద వేసుకుని హ్యాపీగా ఆరగించవచ్చు.