
జాతీయ యువజన దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ సంవత్సరం జనవరి 12వ తేదీన జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. స్వామి వివేకానంద పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజును సెలెబ్రేట్ చేసుకుంటారు.
1984లో భారత ప్రభుత్వం స్వామి వేవేకానంద పుట్టినరోజును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది. 2023 జాతీయ యువజన సంవత్సరం థీమ్ ని కూడా ప్రకటించింది భారత ప్రభుత్వం.
వికసించే యువత వికసించే భారతదేశం అనే అర్థంతో థీమ్ ని వెల్లడి చేసారు. స్వామి వివేకానంద ఆదర్శాలను యువతకు అందించడం, యువతను చైతన్యపరిచి దేశ అభివృద్ధిలో తోడ్పడేలా చేయడం ఈ దినోత్సవం ముఖ్య లక్షణం.
ఈరోజు స్వామి వివేకానంద గురించి, ఆయన యువతకు చెప్పిన సందేశం గురించి కొంచెం తెలుసుకుందాం.
స్వామి వివేకానంద
స్వామి వివేకానంద జీవితం, యువతకు ఇచ్చిన సందేశం
1863 జనవరి 12వ తేదీన కోల్ కతాలో స్వామి వివేకానంద జన్మించారు. మనిషికి విద్య ముఖ్యమని, నిస్వార్థంగా మనుషులకు సేవ చేయడమే జీవిత లక్ష్యంగా ఉండాలని ఆయన సూచించారు.
రామకృష్ణ పరమహంస శిష్యుడిగా ఉంటూ యువతను చైతన్యపర్చడంలో ఆయన కృషి చేసారు. అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సభలో మాట్లాడిన మాటల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.
స్వామి వివేకానంద సూక్తులు
ప్రపంచమనేది ఒక పెద్ద వ్యాయామశాల. అందులో పడి మనల్ని మనం బలంగా తయారు చేసుకోవాలి.
రోజులో ఒక్కసారైనా నీతో నువ్వు మాట్లాడు. లేదంటే ప్రపంచంలో అద్భుతమైన మనిషితో మాట్లాడే అవకాశాన్ని పోగొట్టుకుంటావు.
మీ మనసును, శరీరాన్ని ఏదైతే బలహీనం చేస్తుందో దాన్ని విషంలా భావించి పక్కన పెట్టాలి.