
Ontimitta Temple: ఒంటిమిట్ట రామాలయంలో హనుమంతుడు ఎందుకు లేరు? అసలైన కారణం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
హిందూ పురాణాల ప్రకారం, శ్రీరాముడి భక్తుడిగా హనుమంతుడు ప్రతిచోటా ప్రత్యక్షమవుతుంటాడు.
అయితే మన తెలుగు రాష్ట్రాల్లోని ఓ రామాలయంలో మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహం లేకుండా నిర్మించారు.
ఆ దేవాలయం కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం. ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం లేకపోవడానికి ఉన్న ఆసక్తికర కారణాలను తెలుసుకుందాం.
Details
ఒంటిమిట్ట రామాలయం ప్రత్యేకత
తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాలు విశేష ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి.
భద్రాచలాన్ని భక్త రామదాసు నిర్మించగా, ఒంటిమిట్ట రామాలయాన్ని త్రేతా యుగంలో జాంబవంతుడు నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఆలయంలో మూడు ద్వారాలుంటాయి. ప్రధాన గాలిగోపురం ఉత్తరదిశలో ఉండగా, దక్షిణదిశలో చిన్న గాలిగోపురాలు ఉన్నాయి.
Details
హనుమంతుడు లేకపోవడానికి కారణమిదే
ఇందులో హనుమంతుడి విగ్రహం లేకపోవడానికి ప్రధాన కారణం త్రేతాయుగంలో ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట జరిగే సమయానికి శ్రీరాముడికి ఆంజనేయుడితో పరిచయం లేకపోవడం.
రామాయణంలోని అరణ్యకాండలో శ్రీరాముడు వనవాసంలో ఉన్నప్పుడు హనుమంతుడితో ఇంకా భేటీ కాలేదు.
కిష్కింద కాండలోనే హనుమంతుడు శ్రీరాముడిని కలుస్తాడు. అందుకే ఒంటిమిట్ట ఆలయంలో హనుమంతుడి విగ్రహం ప్రతిష్టించలేదని స్థల పురాణం చెబుతోంది.
Details
ఒంటిమిట్ట - మోనోలిథిక్ సిటీ
ఒంటిమిట్ట రామాలయం శిల్పకళా మహిమను ప్రతిబింబించేలా రూపొందింది.
ఈ ఆలయ విగ్రహాలు ఒకే రాతిలో చెక్కబడి ఉండటంతో దీనిని 'మోనోలిథిక్ సిటీ' అని కూడా పిలుస్తారు.
ఈ పేరుకు మరో కారణం, ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు దొంగలు శ్రీరాముని దర్శనంతో మారిపోవడంతో, ఈ ప్రాంతానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చినట్లు పురాణాల నుంచి తెలుస్తోంది.
Details
సీతారాముల కళ్యాణ మహోత్సవం
ఈ ఆలయంలో వైఖాసన శాస్త్రం ప్రకారం ప్రత్యేకమైన విధానంలో ఉత్సవాలు నిర్వహిస్తారు.
ప్రతేడాది పౌర్ణమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇది నిండు వెన్నెలలో ఆరుబయట జరిపే ప్రత్యేకమైన వేడుక.
బ్రహ్మోత్సవాలు
ప్రతేడాది జరిగే కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, శేషవాహన సేవ, గరుడసేవ, హనుమంత వాహన సేవ, శ్రీ సీతారాముల కళ్యాణం, రథోత్సవం, చక్రస్నానం వంటి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.