శీతాకాలంలో దొరికే పండ్లు వాటి ఆరోగ్య ప్రయోజనాలు
ఏ రుతువులో దొరికే పండ్లు ఆ రుతువులో తినాలని చెబుతారు. ప్రస్తుతం చలికాలం నడుస్తోంది కాబట్టి ఏయే పండ్లు తీసుకుంటే ఎలాంటి ఆరోగ్యం లభిస్తుందో చూద్దాం జామ: ఇది సిట్రస్ జాతికి చెందిన పండు. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ ఏ, పొటాషియం, కాపర్, ఫైబర్ ఉంటాయి. ఇది జీర్ణాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. నారింజ: ఈ పండ్లలో విటమిన్ సి, ఫోలేట్, థయామిన్, ఫైబర్, పొటాషియం అధిక పాళ్ళలో ఉంటుంది. విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కివీ: చలికాలంలో కివీ పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. ఇందులో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చే పోషకాలు ఉంటాయి. మెగ్నీషియం, కాల్షియం, కాపర్, జింక్ ఎక్కువగా ఉంటాయి.
ఆరోగ్యాన్ని అందించే పండ్లు
స్ట్రాబెర్రీ: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సాయపడుతుంది. ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. మాంగనీస్, పొటాషియం, ఫోలేట్, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఆపిల్: ఫైబర్ తో పాటు పెక్టిన్ ఎక్కువగా ఉండే ఆపిల్స్, కడుపు సంబంధిత ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ద్రాక్ష: జీర్ణాశయ సంబంధిత వ్యాధులు రాకుండా అరికట్టే ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. అలాగే దీర్ఘకాల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దానిమ్మ: పంటికింద కరకరమనిపించే దానిమ్మ గింజల్లో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని బాక్టీరియాలతో ఫైట్ చేస్తాయి. విటమిన్ సి ఎక్కువగా ఉండి రోగనిరోధక శక్తి పెరుగుదలకు తోడ్పడుతుంది.