LOADING...
Motivation : ఈ లక్షణాలతో మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదో ఈజీగా తెలుసుకోవచ్చు
ఈ లక్షణాలతో మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదో ఈజీగా తెలుసుకోవచ్చు

Motivation : ఈ లక్షణాలతో మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదో ఈజీగా తెలుసుకోవచ్చు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2025
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆచార్య చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త మాత్రమే కాకుండా, స్నేహం, ప్రేమ, పెళ్లి బంధాలను అద్భుతంగా విశ్లేషించిన గురువుగా ప్రసిద్ధి చెందారు. ఆయన నీతి సూత్రాలు మన జీవితంలోని బంధాలను అర్థమయ్యే విధంగా వివరిస్తాయి. చాణక్య నీతి ప్రకారం ఏ బంధం నిజమైనది, ఏ బంధం కుట్రపూరితమో తెలుసుకోవడం సులభం. సాధారణంగా మనం ప్రేమలో పడటం సహజం. కానీ ఆ ప్రేమ నిజమైనదో లేదో తెలుసుకోవడం కష్టం. కొందరు వ్యక్తులు వేరే ఉద్దేశాలతో కూడా ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటారు. అయితే, నిజంగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తుల ప్రవర్తనలో కొన్ని స్పష్టమైన లక్షణాలు ఉంటాయని చాణక్యుడు చెబుతున్నారు.

 Details

1. తరచూ గమనించడం

మీపై నిజమైన ఆసక్తి ఉన్న వ్యక్తి తరచుగా గమనిస్తారు. మిమ్మల్ని చూసిన వెంటనే చూపు తిప్పుకోవడం, పదేపదే చూడటం, మాట్లాడటానికి ప్రయత్నించడం—అవి సిగ్నల్స్. మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం, ప్రతి చిన్న విషయంపై ఆసక్తి చూపించడం కూడా ప్రేమ లక్షణాలుగా గుర్తించబడతాయి. 2. నవ్వడం, వంగి మాట్లాడడం మిమ్మల్ని చూసి నవ్వడం, మాట్లాడేటప్పుడు కొద్దిగా వంగి, గౌరవంతో ప్రవర్తించడం కూడా ప్రేమకు సంకేతాలు.

Details

3. శ్రద్ధ చూపించడం 

ప్రేమించే వ్యక్తి తెలియకుండానే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అవసరం లేకపోయినా మీ దగ్గరకు రావడం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించడం, ఇతరులతో మీరు స్నేహంగా ఉంటే అసూయపడడం వంటివి చేస్తుంటాడు. 4. సాయం చేయడం సత్యమైన ప్రేమలో ఉన్న వ్యక్తి, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తారు. మీ సంతోషాన్ని, విజయాన్ని తమ సంతోషంగా భావిస్తారు. చాణక్య నీతి ప్రకారం, ఈ లక్షణాలు కనిపిస్తే, ఆ వ్యక్తి మనసులో మీకు ప్రత్యేక స్థానం ఉంది. నిజమైన ప్రేమ కేవలం మాటల్లోనే కాదు, ప్రవర్తనలో కూడా స్పష్టంగా కనిపిస్తుందన్నారు చాణక్యుడు.