LOADING...
Motivation: ఈ నాలుగు లక్షణాలున్న మగవారికి మహిళలు దూరంగా ఉండాలి!
ఈ నాలుగు లక్షణాలున్న మగవారికి మహిళలు దూరంగా ఉండాలి!

Motivation: ఈ నాలుగు లక్షణాలున్న మగవారికి మహిళలు దూరంగా ఉండాలి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2025
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

గొప్ప పండితుడు ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా జీవితంలోని ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ తరం చదువరులకు అందించారు. బంధాలు, సంబంధాలు, నమ్మకం, మనస్తత్వం వంటి అంశాలతో పాటు స్త్రీ-పురుషుల సంబంధాలపై కూడా ఆయన లోతైన బోధనలు చేశారు. చాణక్యుని ప్రకారం, కొన్ని రకాల పురుషుల నుండి మహిళలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అలాంటి లక్షణాలు ఉన్నవారిని నమ్మడం ప్రమాదకరమని స్పష్టం చేశారు.

Details

1. అబద్ధాలు చెప్పే మోసగాళ్లు 

సంబంధాల్లో నమ్మకమే ప్రధాన మూలం. తరచూ అబద్ధాలు చెప్పే పురుషులను మహిళలు అసలు నమ్మకూడదు. అబద్ధాలు చెప్పేవారు తమ సౌకర్యం కోసం ఎప్పుడైనా అసత్యాన్ని ఉపయోగిస్తారు. మొదట మధురంగా మాట్లాడి విశ్వాసం సంపాదించినా... సమయం వచ్చినప్పుడు మోసం చేసే అవకాశాలు ఎక్కువ. 2. నియంత్రించడానికి ప్రయత్నించే వారు ఇప్పటికీ కొంత మంది పురుషులు స్త్రీలను తమ ఆధీనంలో ఉంచుకోవాలని చూస్తారు. మహిళల స్వేచ్ఛను కట్టడి చేసే వ్యక్తులు చాలా ప్రమాదకరులు. అలాంటి వారు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. నీతి శాస్త్రం ప్రకారం, స్వేచ్ఛను పరిమితం చేసే పురుషులకు స్త్రీలు దూరంగా ఉండాలి.

Details

3. దురాశ, స్వార్థం ఉన్న వారు 

కొంత మంది పురుషులు తమ స్వలాభం కోసం మాత్రమే మహిళలతో సంబంధాలు కొనసాగిస్తారు. స్వార్థపరులు కష్టసమయంలో ఎప్పుడూ తోడుగా నిలవరు. తమ ప్రయోజనం లేకపోతే దూరమైపోతారు. నిజంగా గౌరవించే, కష్టకాలంలో అండగా నిలిచే వ్యక్తులనే మహిళలు నమ్మాలి. 4. ప్రతికూల ఆలోచనలు కలిగినవారు మీ పురోగతిని చూసి అసూయపడేవారు, మీ గురించి చెడ్డగా మాట్లాడేవారు, మీ ముందడుగును ఇష్టపడని పురుషులు మహిళలకు మంచివారు కాదు. వీరి ప్రతికూల ఆలోచనలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి, మహిళలను నిరాశలోకి నెట్టేస్తాయి. అందువల్ల ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడం ఉత్తమం.