ప్రపంచ సైకిల్ దినోత్సవం: సైక్లింగ్ ని మీ డైలీ రొటీన్ లో చేర్చుకుంటే కలిగే లాభాలు
ఈ మధ్య కాలంలో బైక్స్ ఎక్కువైపోయి సైకిల్ వైపు ఎవరూ చూడటం లేదు. సైకిల్ అంటే చిన్నపిల్లలు తొక్కేది అన్నట్టుగా ఫీలవుతున్నారు. ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం. ప్రతీ ఏడాది జూన్ 3వ తేదీన సైకిల్ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. సైక్లింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కలిగించేందుకు ఈరోజును జరుపుతున్నారు. శరీరానికి ఫిట్ గా ఉంచడంలో సైక్లింగ్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. బరువు తగ్గడానికి, కండలు బలంగా మారడానికి, కొవ్వును కరిగించడానికి సైక్లింగ్ సాయం చేస్తుంది. ప్రస్తుతం సైక్లింగ్ వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. మరీ ఫాస్ట్ గా కాకుండా ఒక మాదిరిగా ఒక గంటసేపు సైక్లింగ్ చేస్తే 300కేలోరీలు కరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఫోకస్ ని పెంచే సైక్లింగ్
కాళ్ళకు బలాన్ని చేకూరుస్తుంది సైక్లింగ్ వల్ల నడుము కింది భాగానికి బలం చేకూరుతుంది. కాళ్ళు బలంగా తయారవుతాయి. కీళ్ళపై ఎక్కువ ఒత్తిడి పడనీయకుండా కాలి కండరాలకు బలాన్ని అందిస్తుంది. కాళ్ళు బలంగా మారితే సైక్లింగ్ చేసే సామర్థ్యం మరింత పెరుగుతుంది. మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది: మనసుకు ఉల్లాసాన్ని అందించే హార్మోన్లు అయిన ఎండార్ఫిన్లను ఉత్పత్తి చేయడంలో సైక్లింగ్ ఉపయోగపడుతుంది. ఎండార్ఫిన్ల వల్ల మీకు మంచి ఫీలింగ్ వస్తుంది. ఈ కారణంగా ఒత్తిడి, యాంగ్జాయిటీ తగ్గిపోతాయి. సైక్లింగ్ చేస్తున్నప్పుడు మీ మనసంతా ముందున్న గమ్యం మీదే ఉంటుంది. అందువల్ల మీలో ఫోకస్ పెరుగుతుంది. శరీర బ్యాలన్స్ ను పెంచడం, శరీరంతో సరైన కోఆర్డినేషన్ పెంచడం.. వంటి విషయాల్లో సైక్లింగ్ హెల్ప్ చేస్తుంది.