
Children's Day : నేటి పిల్లలే రేపటి సారథులు..అందుకే వారి మాటలను ఆలకించాలి
ఈ వార్తాకథనం ఏంటి
ఏటా నవంబర్ 20న ప్రపంచ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. బాలల హక్కులపై అంతర్జాతీయ కన్వెన్షన్స్ (సమావేశాలు) 1959 నవంబర్ 20న ఆమోదించాయి.
ఐక్యరాజ్యసమితి జనరల్ బాడీ మీటింగ్'లో సూచించిన విధంగా ఏటా నవంబరు 20నే ప్రపంచ బాలల దినోత్సవంగా పాటిస్తుండటం ఆనవాయితీగా మారింది.
1925లోనే బాలల సంక్షేమంపై ప్రపంచ సదస్సు జరిగింది. జెనీవాలో జరిగిన ఈ సదస్సులో అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా ప్రకటించారు.
మరోవైపు జాతీయ బాలల దినోత్సవంే మాత్రం ప్రపంచ దేశాలు తమ దేశంలో బాలల గౌరవార్థం వివిధ తేదీల్లో ఏటా జరుపుకుంటాయి.
ప్రపంచ బాలల దినోత్సవం ఎందుకంటే :
అంతర్జాతీయంగా బాలల హక్కుల గురించి అన్ని దేశాల్లో అవగాహన పెంచి, వారి సంక్షేమాన్ని మెరుగుపర్చడమే దీని లక్ష్యం.
details
బాలలు ప్రపంచ నిధి
ప్రపంచ బాలల దినోత్సవం 2023 సందేశం :
1. ప్రతి చిన్నారికి ఆనందంతో, శాంతితో కూడిన జీవనం అందాలి. అలాగే వారు అభివృద్ధి చెందేందుకు అవకాశాలను కల్పించగలగాలి.
2. నేటి పిల్లలే రేపటి జ్ఞానులు. కనుక వారి మాటలను పెద్దలు వినాలి.
3. మెరుగైన ప్రపంచాన్ని సృష్టించే శక్తి వారికే ఉంది. మార్పునకు ప్రతినిధులుగా పిల్లలను ప్రోత్సహించాలి.
4. పిల్లలు వైవిధ్యంగా ఉండేలా ప్రోత్సహించాలి. ఎందుకంటే వారు ప్రపంచ నిధి.
5. మనం పిల్లలతో ప్రతి క్షణాన్ని ఆస్వాదిద్దాం. ఫలితంగా చిన్నారులకు జీవితంలో నవ్వు, ఆనందంతో గడుపుతారు.
బాల్యం, జీవితంలో వచ్చే ఏకైక దశ. ప్రతీ వ్యక్తికీ ఇది కీలకమైన దశ. బాలలకు మెరుగైన భవిష్యత్ కావాలంటే వారి సంరక్షణతో పాటు పోషకాహారం అందించాల్సిన బాధ్యత మనదే.