World Kindness Day: ప్రపంచ దయాగుణం దినోత్సవం.. చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకుందాం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి ఏటా నవంబర్ 13న ప్రపంచ దయాగుణ దినోత్సవంను జరుపకుంటారు.
దయాగుణం అనేది అన్ని వర్గాల ప్రజలను కలిపే విశ్వవ్యాప్త భాష. ఈ రోజు విభేదాలు ఉన్నప్పటికీ, ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి దయాగుణం అనేది ఉపయోగపడుతుంది.
1997లో టోక్యో కాన్ఫరెన్స్‌లో ప్రపంచం నలుమూలల నుంచి సేవా సంస్థలు World Kindness Dayను ప్రతిపాదించారు.
1998లో వరల్డ్ కైండ్‌నెస్ మూవ్‌మెంట్ ఆర్గనైజేషన్ మొదటి ప్రపంచ దయ దినోత్సవాన్ని నిర్వహించింది.
ఈ దినోత్సవాన్ని కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, నైజీరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా అనేక దేశాలలో జరుపుకుంటారు.
2009లో సింగపూర్ మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంది, ఇటలీ, భారతదేశం కూడా ఈ దినోత్సవాన్ని జరుపుకుంది.
దయాగుణం
ఈ రోజును ఎలా జరుపుకుంటారంటే?
ఇతరులపై దయాగుణం చూపే ప్రజలపై భగవంతుని అపారమైన ఆశీస్సులు ఉంటాయని నమ్ముతుటారు.
దయతో ఉండటం వల్ల ఆత్మ సంతృప్తిని కూడా కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రపంచ దయాగుణం దినోత్సవాన్ని వివిధ రకాలుగా జరుపుకుంటారు.
ఇతరుల పట్ల దయ చూపడం, ప్రేమ, కరుణతో చేరదీయడం వంటి కమ్యూనిటీ ఈవెంట్‌లను నిర్వహిస్తుంటారు.
ప్రపంచ దయాగుణ దినోత్సవం రోజును హైలైట్ చేసే కోట్‌లు, సందేశాలు, కథనాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేయడం ద్వారా అవగాహన కల్పిస్తారు. ఇతరులకు సాయం చేయాలనే విషయాన్ని గుర్తు చేస్తారు.
ఈ రోజును భారతదేశంలో కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రపంచ దయ దినోత్సవం సందర్భంగా పాఠశాలలు, కళాశాలల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించడం, అవగాహన ప్రచారాలను నిర్వహించడం వంటి కార్యకలాపాలను చేపడుతారు.