ప్రపంచ వాతావరణ దినోత్సవం 2023: ఎందుకు జరుపుతారు? తెలుసుకోవాల్సిన విషయాలేంటి?
భూమి మీద వాతావరణం ఇంతకుముందులా లేదు. రోజురోజుకూ భూమి వేడెక్కుతోంది. దీనివల్ల భవిష్యత్తు తరాలకు భూమి మీద బతకడం కష్టంగా మారిపోతుంది. అందుకే వాతావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉండాలి. భూమి మీద వాతావరణం గురించి అందరూ ఆలోచించాలనే ఉద్దేశ్యం, భవిశ్యత్ తరాలను వాతావరణ మార్పుల నుండి తట్టుకునేలా చేయడం కోసం 1950సంవత్సరంలో మార్చ్ 23వ తేదీన ప్రపంచ వాతావరణ కమిటీ ఏర్పడింది. అదే రోజూన ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆ కమిటీ సూచించింది. అప్పటి నుండి మార్చ్ 23వ తేదీని ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ప్రపంచ వాతావరణ కమిటీ అనేది ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ప్రపంచ వాతావరణ దినోత్సవానికి ఒక థీమ్ ఇచ్చారు.
వాతావరణ దినోత్సవం థీమ్, వాతావరణాన్ని కాపాడడానికి చేయాల్సిన పనులు
భవిష్యత్తు తరాల్లో వాతావరణం, నీటి సమస్యలు అన్న థీమ్ తో ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఈ సంవత్సరం జరుపుతున్నారు. దీని ప్రకారం భవిష్యత్తులో రాబోయే వాతావరణ సమస్యలను ముందుగానే పసిగట్టి దేశాల వారిగా సాయం చేసుకోవాలని అన్నారు. వాతావరణాన్ని కాపాడుకోవాలంటే చేయాల్సిన పనులు: చెట్లను నరకడం ఆపేయాలి. అడవులను విధ్వంసం చేయడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. దాని కారణంగా అనేక వాతావరణ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. నీటిని వృధా చేయకూడదు, ప్లాస్టిక్ వినియోగం బాగా తగ్గించాలి. ఫ్యాక్టరీల నుండి వచ్చే రసాయన పదార్థాలు వాతావరణాన్ని పాడుచేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాలుష్యన్ని తగ్గిస్తే వాతావరణం పాడవకుండా కాపాడుకోవచ్చు. కాలుష్యాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి