Page Loader
2050కల్లా ఇండియాలో నీటి సమస్యలు: హెచ్చరించిన యునైటెడ్ నేషన్స్
ఇండియాలో పెరగనున్న నీటి సమస్యలు

2050కల్లా ఇండియాలో నీటి సమస్యలు: హెచ్చరించిన యునైటెడ్ నేషన్స్

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 23, 2023
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

భవిష్యత్తులో భారతదేశం పెను సవాళ్ళను ఎదుర్కునే అవకాశం ఉంది. ఆ సవాళ్ళు మానవ మనుగడపై తీవ్ర ప్రభావం చూపించబోతున్నాయి. అవును, భారతదేశంలో త్వరళో నీటి సమస్య రాబోతుంది. 2050కల్లా భారతదేశంలో నీటి సమస్య తీవ్రంగా మారనుందని యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది. నీళ్ల వినియోగంపై నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడి చేసింది యునైటెడ్ నేషన్స్ పెరుగుతున్న నగర జనాభా కారణంగా, నీటి సమస్యలు రాబోతున్నాయని, 2016లో 933మిలియన్ల నగర జనాభా పెరిగితే, అది ఇప్పుడు 1.7 నుండి 2.4బిలియన్లు గా ఉందని పేర్కొంది. ఇదే లెక్కన పెరుగుతూ వెళ్తే నీటి సమస్య తప్పదనీ తేల్చి చెప్పింది. ఒక్క ఇండియానే కాదు చైనా, పాకిస్తాన్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని తెలిపింది.

ఐక్యరాజ్య సమితి

వ్యవసాయానికే 70శాతం నీటి వినియోగం

నీళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనీ, భవిష్యత్తులో రాబోయే సమస్యను నివారించాలంటే ఇప్పటి నుండే మేల్కొనాల్సిన అవసరం ఉందనీ ఐక్యరాజ్య సమితి డైరెక్టర్ జనల్ ఆడ్రూ అజోలే అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2బిలియన్ల మందికి సరైన తాగునీరు సౌకర్యం లేదు, అలాగే 3.6బిలియన్ల మందికి, రోజువారి అవసరాలకు కావాల్సినన్ని నీళ్ళు దొరకడం లేదని డైరెక్టర్ జనరల్ అన్నారు. ఈ నివేదిక ఎడిటర్ రిచర్డ్ కానోర్ మాట్లాడుతూ, భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలను ఇప్పుడే గుర్తించకపోతే భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారే అవకాశం ఉందనీ, నీటి వినియోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉందనీ, వ్యవసాయ అవసరాలకు 70శాతం నీటిని వినియోగిస్తున్నామని ఆయన గుర్తు చేసారు.