వరల్డ్ పోస్ట్ డే: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు, పంచుకోవాల్సిన కొటేషన్లు
ప్రతీ ఏడాది వరల్డ్ పోస్ట్ డే ని అక్టోబర్ 9వ తేదీన జరుపుకుంటారు. పోస్టల్ సిస్టమ్ చేస్తున్న సేవలను గుర్తించడానికి ఈరోజును జరుపుతారు. టోక్యోకి చెందిన యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ 1969లో వరల్డ్ పోస్ట్ డే ని జరుపుకోవాలని నిర్ణయించింది. 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియర్ ఏర్పడిన రోజును గుర్తు చేసుకోవడానికి అక్టోబర్ 9వ తేదిన వరల్డ్ పోస్ట్ డే ని జరుపుకుంటారు. దాదాపు 151 దేశాల్లో వరల్డ్ పోస్ట్ డే జరుపుకుంటారు. చాలా దేశాల్లో ఈరోజు పబ్లిక్ హాలీడే ఉంటుంది. వరల్డ్ పోస్ట్ డే రోజున పోస్టల్ సిస్టమ్ ప్రాముఖ్యతను జనాలకు తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు జరుపుతారు. పోస్ట్ డే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుపుకుంటారు.
పోస్ట్ డే రోజున పంచుకోవాల్సిన కొటేషన్లు
ఉత్తరాలు, బహుమతులు, అందమైన కొటేషన్లు సులభంగా పోస్ట్ ద్వారా పంపవచ్చని పోస్టల్ సర్వీసులు పరిచయం కాకముందు ఎవ్వరూ ఊహించలేదు. పోస్టల్ సర్వీసుల వల్ల జీవితం ఈజీగా మారిపోయింది. వరల్డ్ పోస్ డే సందర్భంగా, టెక్నాలజీకి దూరం జరిగి మీ ప్రియమైన వారికి మీ చేత్తో చిన్న ఉత్తరం రాయండి. హ్యాపీ వరల్డ్ పోస్ట్ డే 2023. పోస్టల్ సర్వీసులు లేకపోతే ఆర్థికంగా నష్టమే కాదు, ఎమోషనల్ గా ఎంతో ఇబ్బంది ఉండేది. హ్యాపీ వరల్డ్ పోస్ట్ డే. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఉత్తరాలను చేరవేయడంలో ఎలాంటి అలసత్వం చూపని పోస్ట్ మ్యాన్స్ అందరికీ వరల్డ్ పోస్ట్ డే రోజున దన్యవాదాలు తెలియజేద్దాం.