Page Loader
Longest Road: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోడ్డు ఎక్కడ ఉందొ తెలుసా? దాని విశేషాలేంటంటే..
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోడ్డు ఎక్కడ ఉందొ తెలుసా? దాని విశేషాలేంటంటే..

Longest Road: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోడ్డు ఎక్కడ ఉందొ తెలుసా? దాని విశేషాలేంటంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2025
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

రోడ్డు అంటే మలుపులు, వంకలు సహజం. మన దేశంలో వందల కిలోమీటర్ల పొడవు ఉండే నేషనల్ హైవేస్ ఎన్నో రాష్ట్రాలను కలుపుతూ వెళ్తాయి. వేర్వేరు ప్రాంతాల నుంచి వెళ్లే రహదారులపై టర్నింగ్స్, క్రాసింగ్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ 30,000 కిలోమీటర్ల పొడవున్న ఒక రోడ్డుపై మాత్రం అలాంటివేమీ లేవంటే నమ్ముతారా? ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోడ్డుగా గుర్తింపు పొందింది. ఇది ఎక్కడ ఉంది? దాని విశేషాలు ఏమిటో చూద్దాం.

వివరాలు 

14 దేశాల మీదుగా... 

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోడ్డుగా పాన్-అమెరికన్ హైవే (Pan-American Highway) ప్రసిద్ధి చెందింది. దీని మొత్తం పొడవు 19,000 మైళ్లు, అంటే సుమారు 30,577 కిలోమీటర్లు. ఈ రహదారి మొత్తం 14 దేశాల మీదుగా ప్రయాణిస్తుంది. అందులో అమెరికా, కెనడా, మెక్సికో, గ్వాటిమాలా, ఎల్ సాల్వడార్, హోండురస్, నికరాగువా, కోస్టారికా, పనామా, కొలంబియా, ఈక్వడార్, పెరూ, చిలీ, అర్జెంటీనా దేశాలు ఉన్నాయి.

వివరాలు 

30,000 కిలోమీటర్ల పొడవునా టర్న్ లేదు..

ఈ రహదారి అలాస్కాలోని ప్రుధో బే వద్ద ప్రారంభమై అర్జెంటీనా ఉషుయా వద్ద ముగుస్తుంది. ఈ రహదారి పయనంలో అనేక అందమైన ప్రదేశాలను చూడవచ్చు. దట్టమైన అడవులు, అరుదైన జంతుజాతులు, అలాస్కాలోని ఆర్కిటిక్ టండ్రాలు, సెంట్రల్ అమెరికాలోని మడ అడవులు, పెరూలో ఎడారులు, అర్జెంటీనా దక్షిణ భాగంలో రఫ్ భూభాగం వంటి వివిధ భౌగోళిక విశేషాలను అనుభవించవచ్చు. ఇది రెండు అమెరికా ఖండాల సంస్కృతి, సంప్రదాయాలను కలిపే వారధిగా నిలుస్తుంది.

వివరాలు 

ఒకే ఒక చోట..

ఈ రహదారి పొడవున ఎక్కడా పెద్ద మలుపులు, యూ టర్న్‌లు కనిపించవు. అయితే పనామా, కొలంబియా మధ్య ఉన్న దట్టమైన అడవిలో 160 కిలోమీటర్ల పొడవు రహదారి మధ్యలో నిలిచినట్లు ఉంటుంది. దీనిని "డేరియన్ గ్యాప్" అని పిలుస్తారు. పర్యావరణం, ఇతర ఆచరణాత్మక కారణాల వల్ల ఇక్కడ రహదారి నిర్మించలేదు. దీంతో ఫెర్రీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాల్సి వస్తుంది.

వివరాలు 

సాహస యాత్రికుల కోసం పెద్ద పరీక్ష..

ఈ రహదారిపై ప్రయాణం సులభమని భావించకూడదు. ఈ రహదారి కఠిన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనడానికి సాహస వనరులు అవసరం. కొన్నిచోట్ల ఎత్తైన కొండ ప్రాంతాలు, మరికొన్ని ప్రాంతాల్లో మారుమూల అడవులు, వందల కిలోమీటర్ల వరకు సదుపాయాలు లేకుండా ప్రయాణించవలసి ఉంటుంది. ఆండీస్ పర్వతాలలో ప్రయాణించే సమయంలో పర్వత రోగం వచ్చే ప్రమాదం ఉంటుంది.

వివరాలు 

వింతల ప్రయాణం..

సాహస యాత్రలను, కొత్త ప్రదేశాలను అన్వేషించే వారికి పాన్-అమెరికన్ హైవే ప్రత్యేకమైన అనుభవాలను ఇస్తుంది. కెనడాలోని బన్ఫ్ నేషనల్ పార్క్ నుంచి కోస్టారికా రెయిన్‌ఫారెస్ట్‌ల వరకు, పటగోనియా మంచు పర్వతాల వరకు ఈ రహదారి అందించిన అనుభవాలు మరుపురానివి. ఆహార సంప్రదాయాల పరంగా కూడా మెక్సికో టాకోస్ నుంచి అర్జెంటీనా మాల్బెక్ వైన్ వరకు అనేక రుచులను ఆస్వాదించవచ్చు. ప్రపంచంలోని అతిపెద్ద హైవే.. ఈ హైవే ఐక్యత, ఉమ్మడి చరిత్రకు ప్రతీకగా నిలుస్తోంది. దేశాలను, ప్రజలను కలిపే ఈ అద్భుత ప్రయాణం జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకాలను మిగులుస్తుంది.