Page Loader
వరల్డ్ టీన్ మెంటల్ వెల్నెస్ డే: చరిత్ర, విశేషాలు, టీనేజర్ల మానసిక సమస్యలు, అధిగమించే పద్దతులు
వరల్డ్ టీన్ మెంటల్ వెల్నెస్ డే చరిత్ర, విశేషాలు

వరల్డ్ టీన్ మెంటల్ వెల్నెస్ డే: చరిత్ర, విశేషాలు, టీనేజర్ల మానసిక సమస్యలు, అధిగమించే పద్దతులు

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 02, 2023
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతీ సంవత్సరం మార్చ్ 2వ తేదీన వరల్డ్ టీన్ మెంటల్ వెల్నెస్ డే జరుపుకుంటారు. టీనేజర్లు ఎదుర్కునే మానసిక సమస్యలపై అవగాహన కోసం ఈ రోజును జరుపుకుంటున్నారు. చరిత్ర: హోలిస్టర్ అనే బట్టల సంస్థ, ఈ ప్రోగ్రామ్ ని చేపట్టింది. దీని ప్రకారం టీనేజర్లకు ప్రపంచం గురించి తెలియజేయాలనీ, తమపట్ల తాము నమ్మకంగా ఉండాల్ని తెలిపేందుకు మొదలెట్టింది. ఈ హోలిస్టర్ అనే సంస్థ, యువత కోసం పాటుపడే సంస్థలకు డబ్బులు విరాళంగా ఇస్తుంది. రోజులు మారే కొద్దీ ప్రపంచం చాలా మారిపోతోంది. ఎంత మారినా కూడా కొన్ని విషయాల్లో ఇంకా వెనుకబడే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా టీనేజర్ల మానసిక సమస్యలను అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రులు చాలా దూరంలో ఉన్నారు.

పిల్లల పెంపకం

పిల్లలు మానసికంగా బాలేరని పెద్దలు ఎలా తెలుసుకోవాలంటే

మీ పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారి మీద మీ దృష్టి ఎక్కువగా ఉండాలి. ఐతే అది పూర్తి ఇన్వాల్వ్ మెంట్ లా కాకుండా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మానసికంగా బాధపడే పిల్లల్లో.. బాధగా ఉండడం, అలసట, ఎప్పుడూ నీరసంగా ఉండడం, దృష్టి నిలపలేకపోవడం, ఏదో తప్పు చేసాననే బాధ ఎక్కువగా ఉండడం, అనవసర భయాలు, ఆందోళనలు కనిపిస్తాయి. స్నేహితుల నుండి దూరం జరగడం, ఆత్మహత్య ఆలోచనలు, విపరీతమైన కోపం, హింస మొదలగు లక్షణాలు కూడా పిల్లల్లోని మానసిక బలహీనతకు లక్షణాలు. బయటపడే దారులు: ఇలాంటి సమస్యలతో మీ పిల్లలు బాధపడుతుంటే, అసలేం జరిగిందో వాళ్ళను అడగండి. వాళ్ళను మాట్లాడనివ్వండి, ఇంకా ధ్యానం, డీప్ బ్రీత్, శారీరక శ్రమ కారణంగా మానసిక బలహీనతల నుండి బయటపడొచ్చు.