ప్రపంచ తలసేమియా డే: ఈ వ్యాధి ఎలా వస్తుంది? దీనికి చికిత్సలు ఏంటి?
తలసేమియా అనేది జన్యుపరమైన వ్యాధి. తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే వ్యాధి ఇది. ఎర్రరక్త కణాలలోని హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందదు. ఇంకా శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని తలసేమియా వ్యాధి అంటారు. తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించడానికి, తలసీమియా పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో 1994లో తలసీమియా ఇంటర్నేషన్ ఫెడరేషన్ అధ్యక్షుడు పానోస్ ఎంగ్లిజోస్, ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం మే 8వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించారు. ప్రపంచ వ్యాప్తంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారు కోట్లలో ఉన్నారు. భారతదేశంలో దాదాపు 3కోట్ల మంది ఉన్నారు.
తలసేమియా వ్యాధి లక్షణాలు, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
లక్షణాలు: తలసేమియాతో బాధపడుతున్న వారిలో నీరసం, అలసట, ఎదుగుదల లేకపోవడం, చర్మం రంగు పాలిపోవడం, కండరాల నొప్పి, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స: తలసేమియా వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు రక్తమార్పిడి చేయాల్సిన అవసరం ఉంటుంది. కొదరిలో ఎముక మూలుగను( బోర్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్) కూడా మారుస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ వ్యాధితో పడేవారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి. అప్పుడే వండిన ఆహారాన్ని తీసుకోవాలి. పచ్చి కూరగాయలు, పండ్లు ముట్టుకోకపోతే మంచిది. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. కావాల్సినన్ని నీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి