LOADING...
Navratri 2025: దేవీ శరన్నవరాత్రుల్లో ఈ పుష్పాలతో పూజించటం వల్ల కోరికలు నెరవేరుతాయట?
దేవీ శరన్నవరాత్రుల్లో ఈ పుష్పాలతో పూజించటం వల్ల కోరికలు నెరవేరుతాయట?

Navratri 2025: దేవీ శరన్నవరాత్రుల్లో ఈ పుష్పాలతో పూజించటం వల్ల కోరికలు నెరవేరుతాయట?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2025
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది అశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం పాడ్యమి నుండి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ పది రోజులలో, పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారు ప్రతి రోజూ ప్రత్యేక అలంకారంతో భక్తుల ముందుకు వస్తారు. భక్తులు అత్యంత శ్రద్ధ, నియమం, నిష్టతో దుర్గాదేవిని పూజిస్తారు. ఈ ఏడాది నవరాత్రులు సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమవుతాయి. ఈ సందర్భంలో అమ్మవారి అనుగ్రహం పొందాలనుకుంటే, ఏ పుష్పాలతో పూజించాలి అనే విషయాన్ని ఆధ్యాత్మిక గురువులు ఇలా వివరించారు:

పుష్పాలు

అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఈ పుష్పాలతో పూజించండి

మల్లె పూలు: నవరాత్రుల్లో అమ్మవారిని మల్లె పూలతో పూజిస్తే ధన సంపత్తి లభిస్తుంది. పద్మ పుష్పాలు: ఈ పుష్పాలతో పూజ చేస్తే మానసిక ప్రశాంతి, శాంతి లభిస్తుంది. అదేవిధంగా, పుత్ర సంతానం పొందే యోగం కూడా ఉంటుంది. గన్నేరు పూలు: మంత్ర జపానికి మంచి ఫలితాలు కావాలంటే గన్నేరు పూలతో అమ్మవారిని పూజించాలి. మంత్ర సిద్ధి సులభంగా లభిస్తుంది. ఎర్ర కలువ/ఎర్ర తామర పువ్వులు: ఈ పువ్వులతో పూజ చేస్తే జనాకర్షణ పెరుగుతుంది. ప్రజలను ఆకర్షించాలనుకుంటే ఈ పూజ చేయడం మంచిది. సన్న జాజిపూలు: కొంతమంది మాట్లాడేటప్పుడు మాట తడబడే సమస్య ఉంటే, ఈ పూలతో అమ్మవారిని పూజిస్తే సమస్య తగ్గుతుంది. ఇది వాక్ శుద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

పుష్పాలు

అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఈ పుష్పాలతో పూజించండి

తుమ్మిపూలు: తుమ్మిపూలతో పూజ చేసినప్పుడు ఆహార కొరత సమస్యలు రాదు. ఇంట్లో అన్నానికి ఎటువంటి లోటు రాకుండా ఉంటుందని చెబుతున్నారు. పారిజాత పుష్పాలు: కాలసర్ప దోషాలను తొలగించాలంటే, ఈ పుష్పాలతో అమ్మవారిని పూజించడం మంచిది. అశోక పుష్పాలు: మహిళల ఇంట్లో సంసార బాధలు, కష్టాలు తొలగించాలంటే అశోక పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. అద్భుత ఫలితాలు లభిస్తాయి. ఈ విధంగా, నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో పుష్పంతో అమ్మవారిని పూజించడం ద్వారా ఒక్కో విధమైన ఫలితాలు, లాభాలు పొందవచ్చని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు.