NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Yoga asanas for lower back pain: నడుము నొప్పికి యోగాసనాలు: ఉపశమనాన్ని తెచ్చే 8 వ్యాయామాలు 
    తదుపరి వార్తా కథనం
    Yoga asanas for lower back pain: నడుము నొప్పికి యోగాసనాలు: ఉపశమనాన్ని తెచ్చే 8 వ్యాయామాలు 
    నడుము నొప్పికి యోగాసనాలు: ఉపశమనాన్ని తెచ్చే 8 వ్యాయామాలు

    Yoga asanas for lower back pain: నడుము నొప్పికి యోగాసనాలు: ఉపశమనాన్ని తెచ్చే 8 వ్యాయామాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 01, 2024
    01:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రసత్త బిజీబిజీ లైఫ్‌స్టైల్‌'లో గంటల తరబడి సిస్టం ముందు కూర్చుని ఉండటం, వర్క్ ప్రెషర్ , కాల్షియం లోపం కారణంగా నడుము నొప్పితో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది.

    ఈ నడుము నొప్పితో ఏ పనిచేయాలన్నా కష్టమే. ఎక్కువసేపు కూర్చున్నా లేదా నిలబడినా నడుమునొప్పిని తట్టుకోలేము.

    అయితే,నడుము నొప్పిని యోగాతో దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

    కొన్ని యోగాసనాలు క్రమం తప్పకుండ ప్రాక్టిస్‌ ఉపశమనం లభిస్తుందని .. అమెరికాలోని మేరీల్యాండ్‌ యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో తేలింది.

    నడుము నొప్పిని దూరం చేసే యోగాసనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

    Details 

    ఈ యోగాసనాలతో.. నడుము నొప్పి మాయం అవుతుంది..!

    బాలాసనం: బాలాసనం వేయడానికి ముందుగా.. బాలాసనం వేయడానికి ముందుగా.. బోర్లా పడుకుని కుడి మోకాలు, కుడి చేతిని పక్కకు మడిచిపెట్టాలి. ఎడమ కాలు, ఎడమ చేయి కిందికి తిన్నగా ఉంచేసి సేద పడుకోవాలి. ఈ సున్నితమైన సాగతీత దిగువ వీపులో ఒత్తిడిని విడుదల చేయడంలో సహాయపడుతుంది.

    మర్జర్యాసనం: ఈ ఆసనం వేయడానికి ముందుగా వజ్రాసనంలో కూర్చొని..శరీరాన్ని ముందుకు వంచుతూ రెండు మోకాలు, రెండు అరచేతులను నేలకు ఆనించి . నడుమును పైకెత్తి తలను కొద్దిగా కిందికి దించాలి. శ్వాసను వదలాలి. నడుమును కిందికి వంచుతూ తలను పైకెత్తి శ్వాస పీల్చుకోవాలి. ఈ కదలిక వల్ల వెన్నెముక వశ్యతను మెరుగుపరుస్తుంది .

    Details 

    ఈ యోగాసనాలతో.. నడుము నొప్పి మాయం అవుతుంది..!

    అధో ముఖ స్వనాసన: ఈ ఆసనం కోసం ముందుగా రెండు అరచేతులను తలకిరువైపుల ఆనిచ్చి . కాలి వేళ్లతో నేలను నొక్కి పట్టాలి. ఇప్పుడు చేతులు, కాళ్ల పాదాలపై శరీర బరువును బ్యాలెన్స్ చేస్తూ బాడీని పైకి గాల్లోకి లేపాలి. ఈ భంగిమలో చేతలు, కాళ్లు, వెన్నుపూస నిటారుగా ఉండాలి. తల కిందకు ,పిరుదుల పైకి లేపాలి. ఇలా కాసేపు ఆగి మోకాళ్లను నేలపై ఆన్చి వజ్రాసనంలో కూర్చొవాలి. దీనివల్ల వీపు ఒత్తిడిని తగ్గుతుంది.

    భుజంగాసనం: మీ పొట్టపై పడుకుని, భుజాల కింద చేతులు, కటిని నేలపై ఉంచుతూ మీ ఛాతీని పైకి ఎత్తండి. దీనివల్ల వెనుక కండరాలు బలపడి, వశ్యతను ప్రోత్సహిస్తుంది.

    Details 

    ఈ యోగాసనాలతో.. నడుము నొప్పి మాయం అవుతుంది..!

    సేతు బంధాసనం: ముందుగా నేలపై పడుకొని రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు రెండు కాళ్లను మడిచి.. పాదాలు రెండు చేతులతో పట్టుకోని, భుజాలు, పాదాలు బేస్ చేసుకుని.. నడుము భాగాన్ని పూర్తిగా పైకి లేపాలి. తల నేలపై ఉండాలి. ఇలా కొన్నిసార్లు శ్వాస పీల్చుకొన్న తరువాత సాధారణ స్థితికి వచ్చి రిలాక్స్ అవ్వాలి.

    పశ్చిమోత్తనాసనం: ఈ ఆసనంలో ముందుగా నేలపై కూర్చుని చేతులను ముందుకు చాపుతూ కాళ్లకు తాకేలా బాడీని స్ట్రెచ్ చేయాలి. దీనివల్ల ఛాతి, వెన్నెముక, కాళ్లు, చేతి కండరాలు బలంగా మారతాయి.

    Details 

    ఈ యోగాసనాలతో.. నడుము నొప్పి మాయం అవుతుంది..!

    అపనాసనం: ముందుగా వెల్లికిలా పడుకుని, మోకాళ్లను ఛాతీపైకి తీసుకుని, వాటిని మీ చేతులతో పట్టుకోండి. ఇలా ఈ భంగిమలో 15 సెకన్ల పాటు ఉండి ఆరు సార్లు రిపీట్ చేయండి. దీనివల్ల అసౌకర్యం నుండి ఉపశమనం లభిస్తుంది.

    పాదహస్థాసన: ముందుగా నిటారుగా నిలబడి ,తర్వాత మెల్లగా చేతులను నిటారుగా పైకి తీసుకురావాలి. శరీరం ను మెల్లగా పైకి సాగదీసి పిరుదును ముందుకు వంచాలి.ఇప్పుడు శ్వాస వదులుతూ ముందుకి వంగి చేతులతో పాదాలను తాకాలి. ఆలా తలను మోకాలికి ఆన్చుకోవాలి. ఇలా కొద్ది క్షణాలు ఉన్న తరువాత మెల్లగా యధా స్థితికి రావాలి. ఈ ఆసనం రెగ్యులర్ గా చెయ్యడం వల్ల నడుము నొప్పిని తగ్గిపోతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యోగ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    యోగ

    యోగసనాలతో ముడతలు దూరం చలికాలం
    నరాల బలహీనత వల్ల కాళ్ళలో వణుకు పుడుతుందా? ఈ యోగాసనాలు ప్రయత్నించండి వ్యాయామం
    ఐబీఎస్ తో ఇబ్బందిపడేవారు ఈ యోగాసనాలతో ఉపశమనం పొందండి లైఫ్-స్టైల్
    వెరికోస్ వెయిన్స్ లేదా ఉబ్బు నరాలు తగ్గిపోవాలంటే చేయాల్సిన యోగాసనాలు వ్యాయామం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025