వ్యాపారం: మీకున్న ఈ అభిరుచులను బిజినెస్ గా మార్చుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
మీకేది ఇష్టమో తెలుసుకోండి, ఆ తర్వాత దానిలో అత్యంత నైపుణ్యాన్ని సాధించండి - స్టీవ్ జాబ్స్
మీకున్న హాబీని వ్యాపారంగా మార్చుకుంటే చేసే పనిలో అలుపు రాకుండా ఉండడమే కాకుండా ఆర్థికంగా కూడా నిలదొక్కుకుంటారు. ప్రస్తుతం ఎలాంటి అభిరుచులను వ్యాపారంగా మార్చుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందో తెలుసుకుందాం.
బేకింగ్:
ఈ ప్రపంచంలో 700కోట్లకు పైగా జనాభా ఉన్నారు. అంటే రోజూ 21మిలియన్ల మంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కాబట్టి మార్కెట్ కి ఢోకా ఉండదు.
అల్లికలు:
చేతితో చేసిన అల్లికలకు మంచి గిరాకీ ఉంటుంది. దీన్ని నేర్చుకోవడం హాయిగా ఉంటుంది కూడా. చిన్నచిన్న వస్తువులను అల్లడం నేర్చుకుంటే మంచి బిజినెస్ ఏర్పడుతుంది. మార్కెట్ కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన పనిలేదు. ఆన్ లైన్ ఉందని తెలుసుకోండి.
హాబీలు
వ్యాపారంగా సక్సెస్ అయ్యే హాబీలు
ఫోటోగ్రఫీ:
ఫోటో సెన్స్ కొద్దిగా ఉండి, కెమెరా కొనుక్కునే డబ్బులుంటే చాలు, మీరు ఫోటోగ్రాఫర్ ఐపోవచ్చు. పెళ్ళిళ్ళనేవి ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయని గుర్తుంచుకోండి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
వ్లాగింగ్:
ఏదైనా కొత్త ప్రదేశం చూసినపుడో లేదా మీకు మేకప్ మీద ఇంట్రెస్ట్ ఉండి దాని గురించి అవతలి వారికి చెప్పాలనుకున్నప్పుడో వ్లాగింగ్ బాగా పనిచేస్తుంది. ఇది మెల్లమెల్లగా వ్యాపారంగా మారిపోతుంది. మీకు స్పాన్సర్స్ కూడా వస్తారు.
క్రాఫ్టింగ్:
చిన్న చిన్న వస్తువులతో బొమ్మలు తయారు చేయడం, పర్స్ కవర్స్, ఇలా విభిన్న రకాలుగా చేస్తే మీకంటూ ఓ మార్కెట్ తయారవుతుంది. అప్పుడు మీ వస్తువులను కొనడానికి ఇష్టపడతారు.