కేర్ పూజ: కఠిన నియమాలతో త్రిపురలో జరిగే ఈ పండగ విశేషాలు
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఈ పండగను జరుపుకుంటారు. ఈ పండగ సమయంలో భక్తులు, వాస్తు దేవతను సంరక్షించే కేర్ ను పూజిస్తారు. జులై 11నుండి మొదలయ్యే ఈ పండగ మూడు రోజులు కొనసాగుతుంది. తరతరాల నుండి ఈ పూజను చేస్తూ వస్తున్నారు. ఈ పూజ విశేషాలు ఏంటో చూద్దాం. పండగ జరిగే మూడు రోజుల సమయంలో త్రిపుర రాజధాని అగర్తల ప్రవేశ మార్గాలు మూసివేస్తారు. ఈ మూడు రోజుల్లో వినోదం, ఏదైనా సెలెబ్రేషన్స్ మొదలైన వాటిపైన నిషేధం ఉంటుంది. పూజ మొదలయ్యే రోజున, పూర్తయ్యే మూడవ రోజున త్రిపుర పోలీసులు గాల్లో కాల్పులు జరుపుతారు. పండగ అట్టహాసంగా ప్రారంభమవుతుంది. కానీ పూజ సమయంలో అందరూ సైలెంట్ గా ఉంటారు.
చనిపోయినా, పుట్టినా ఫైన్ విధించే నియమాలు
గర్భిణీ స్త్రీలు, ముసలివాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని వారి సేఫ్టీ కోసం ఇతర గ్రామాలకు పంపిస్తారు. ఈ పూజను ఎలా జరిపించాలనేది పంతులు చూసుకుంటారు. జంతుబలి ఈ పూజలో భాగంగా ఉంటుంది. డ్యాన్స్ చేయడం, చెప్పులు వేసుకోవడం అనేవి ఈ పూజా సమయంలో నిషేధం. ఒకవేళ ఎవరైనా ఈ నియమాలను పాటించకపోతే వారికి ఫైన్ వేస్తారు. ఒకవేళ ఎవరి ఇంట్లో అయినా ఎవరైనా మరణించినా, లేదా పుట్టినా ఆ కుటుంబానికి ఫన్ విధిస్తారు. పూజా సమయంలో కేర్ దేవతకు నమస్కరించి తమకు చల్లగా చూడాలని కోరుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలు, శత్రువుల నుండి వచ్చే ప్రమాదాల నుండి కేర్ దేవత కాపాడుతుందని అక్కడి ప్రజల నమ్మకం.