ప్రేరణ: సమయాన్ని నీ చేతుల్లో ఉంచుకోకపోతే నీకంటూ జీవించడానికి సమయం ఉండదు
ఈ వార్తాకథనం ఏంటి
పొద్దున్న లేవగానే చకచకా స్నానం చేసేసి తొందరగా తొందరగా ఆఫీసుకు వెళ్ళి, మళ్ళీ సాయంత్రమెప్పుడో ఇంటికి వచ్చేసి, కనీసం భార్యతో మాట్లాడడానికి కూడా టైమ్ లేకుండా, అన్నం తినేసి నిద్రపోయి మళ్ళీ తెల్లారి నిద్రలేచి ఆఫీసుకు రెడీ అవుతున్నారా?
ఈ ప్రాసెస్ ని మీరు ఎంజాయ్ చేస్తుంటే సమస్య లేదు. కానీ, మీరనుకున్న పనులు చేయట్లేదని బాధపడుతూ, భార్యతో మాట్లాడడానికి సమయం ఉండట్లేదని చింతిస్తూ ఉంటే మాత్రం మీరు మీ టైమ్ ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేక పోతున్నారని అర్థం.
అందరికీ 24గంటల టైమ్ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే అన్ని రకాల పనులు చేస్తూ కూడా ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తారు. ఇంకొందరేమో ఒక్క పని చేస్తూనే అసలు టైమే లేదన్నట్టు ఫీలవుతుంటారు.
Details
టైమ్ ని మేనేజ్ చేయలేకపోవడానికి ముఖ్య కారణం బద్దకం
సమయాన్ని మీ చేతుల్లో ఉంచుకోవాలి. అంటే, మీరేం చేయాలనుకుంటున్నారో దానికోసం మీ దగ్గర ఎంతోకొంత టైమ్ ఉండాలి. అలా ఉండేలా మీ రోజువారి పనులను సర్దుబాటు చేసుకోవాలి.
సర్దుబాటు చేయడం కష్టమని ఫీలవకండి. తలచుకుంటే సర్దుబాటు చేయవచ్చని తెలుసుకోండి.
నిజం చెప్పాలంటే ప్రతీ ఒక్కరికీ తాము ఏది చేయాలనుకున్నా దానికి కావాల్సినంత టైమ్ తప్పకుండా దొరుకుతుంది. దొరకట్లేదని కంప్లైంట్ చేసే వారందరూ, తాము చేయాలనుకున్న పనిమీద బద్దకంతోనే అలా చెబుతారు.
ఒక్కసారి బద్దకాన్ని వీడి చూడండి. మీలోంచి కొత్త వెలుగు కనిపిస్తుంటుంది.
సమయం మీ చేతుల్లో లేకుండా పోతే, మీ జీవితంలో అశాంతి చేకూరుతుంది. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా ఉంటారు. చివరగా, మీకంటూ ఒక జీవితం లేకుండా ఎవరికోసమో బతుకుతుంటారు.