NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / మేకప్: కళ్ళకింద చర్మానికి ఎలాంటి పదార్థాలున్న ప్రొడక్టులు వాడకూడదో చూడండి
    తదుపరి వార్తా కథనం
    మేకప్: కళ్ళకింద చర్మానికి ఎలాంటి పదార్థాలున్న ప్రొడక్టులు వాడకూడదో చూడండి
    కళ్ళకింద చర్మానికి వాడే ప్రోడక్టుల్లో వాడకూడని సాధనాలు

    మేకప్: కళ్ళకింద చర్మానికి ఎలాంటి పదార్థాలున్న ప్రొడక్టులు వాడకూడదో చూడండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 06, 2023
    12:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చర్మ సంరక్షణ కోసం వాడే వస్తువుల్లో కంటి కింద భాగం కోసం వాడే సాధనాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే కళ్ళకింద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.

    అందువల్ల మీరు వాడే సాధనాల్లో ఉండే పదార్థాలు కళ్ళకు హాని కలిగించవచ్చు. అలాంటి పదార్థాలున్న సాధనాలను పక్కన పెట్టాలి. ఎలాంటి పదార్థాలున్న వస్తువులు వాడకూడదో ఇక్కడ చూద్దాం.

    సాలిసిలిక్ ఆసిడ్:

    చర్మ సంరక్షణకు సాలిసిలిక్ ఆసిడ్ బాగా పనిచేస్తుంది. కాకపోతే కళ్ళకింద చర్మానికి మాత్రం ఇది మేలు చేయదు. దీని కారణంగా కళ్ళకింద చర్మం ఎర్రబడటం, దురద, మంటలు పుట్టడం కలుగుతుంది.

    రెటినాల్:

    చర్మ సాధనాల్లో ఈ పదార్థం ఉంటుంది. దీన్ని కళ్లకింద చర్మానికి మర్దన చేసినట్లయితే చర్మం పొడిబారుతుంది.

    చర్మ సంరక్షణ

    కంటికింద చర్మానికి వాడే సాధనాల్లో ఉండకూడని పదార్థాలు

    ఆల్కహాల్:

    కళ్ళకింద చర్మానికి వాడే ప్రోడక్టుల్లో ఉండకూడని మరో పదార్థం ఆల్కహాల్. దీని కారణంగా చర్మంలోని తేమ మాయమై పొడిబారుతుంది. ఒక్కోసారి పూర్తి పొడిగా మారిపోయి నొప్పి కలిగే అవకాశం ఉంది.

    ప్యారబెన్స్:

    ఈ పదార్థం దాదాపు ప్రతీ చర్మ సంరక్షణ సాధనాల్లో ఉంటుంది. ప్యారబెన్స్ కారణంగా కంటికింద చర్మానికి దురద కలుగుతుంది. ఒక్కోసారి చర్మం ఎర్రగా మారిపోతుంది. కొన్నిసార్లు చర్మం ఉబ్బుతుంది కూడా. అందుకే వీటిని పక్కన పెట్టండి.

    స్టెరాయిడ్స్:

    కళ్ళకింద చర్మం సున్నితంగా ఉంటుందని ఇంతకుముందే చెప్పుకున్నాం. స్టెరాయిడ్స్ ఉన్న సాధనాలను వాడితే మరింత సున్నితంగా మారిపోతుంది. ముఖం మీద ఇతర భాగాలకు ఇలాంటి పదార్థాలు బాగానే పనిచేస్తాయి. కానీ కళ్ళకింద చర్మానికి అంతగా ఉపయోగపడవు. పైగా నష్టం చేస్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చర్మ సంరక్షణ

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    చర్మ సంరక్షణ

    చర్మ సంరక్షణ: టీ తాగితే మొటిమలు దూరమవుతాయనిమీకు తెలుసా? ఇది చూడండి లైఫ్-స్టైల్
    చర్మ సంరక్షణ: 20ఏళ్ళ వయసులో 40ఏళ్ల వాళ్ళలా కనిపిస్తుంటే మానుకోవాల్సిన అలవాట్లు లైఫ్-స్టైల్
    నల్లమచ్చలు పోగొట్టడం నుండి ముడతలను దూరం చేసే వరకు చర్మానికి జిన్సెంగ్ చేసే ప్రయోజనాలు లైఫ్-స్టైల్
    ఆయుర్వేద పదార్థాలతో చర్మాన్ని సురక్షితంగా ఉంచుకునే మార్గాలు లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025