వేసవి వేడి తగలకుండా ఉండాలంటే సత్తుపిండి ఆహారాలు తినాల్సిందే
సత్తులో ప్రోటీన్, ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటాయి. కాల్చిన శనగ పప్పును గ్రైండర్ రుబ్బడం వల్ల సత్తు తయారవుతుంది. రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సత్తు పదార్థంతో పానీయాలు తయారు చేసుకుంటారు. దీనివల్ల వేసవి వేడి ఉపశమనం కలుగుతుంది. సత్తువల్ల కలిగే ప్రయోజనాలు జీర్ణక్రియను పెంచే సత్తు: సత్తులోని పోషకాల కారణంగా మలబద్దకం, అసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు దూరమవుతాయి. బరువును తగ్గిస్తుంది: సత్తు తో షర్బత్ తయారు చేసుకుని రోజూ తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. ఇందులో ఫైబర్ కారణంగా తొందరగా ఆకలి వేయదు. దానివల్ల ఎక్కువ తినకుండా ఉంటారు. ఫలితంగా బరువు తగ్గుతారు. అందుకే సత్తును మీ డైలీ డైట్ లో చేర్చుకోండి.
సత్తు వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు
జుట్టుకు, చర్మానికి మంచి చేస్తుంది: చర్మాన్ని పొడిబారకుండా చేసి మెరిసే గుణాన్ని అందిస్తుంది. అంతేకాదు మొటిమలు, దద్దుర్లు, దురదలు వంటి సమస్యలు రాకుండా సత్తు చూసుకుంటుంది. ఇందులోని ప్రోటీన్, ఐరన్ కారణంగా జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి. తద్వారా జుట్టు ఊడిపోవడం తగ్గిపోతుంది. నీరు తగ్గిపోకుండా చూసుకుంటుంది: ఎండాకాలంలో శరీరంలో నీరు తగ్గిపోతుంటుంది. ఈ పరిస్థితిని సత్తు నివారిస్తుంది. శరీరంలో పేరుకున్న మలినాలను బయటకు పంపించడంలో సత్తు చాలా హెల్ప్ చేస్తుంది. గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే సత్తు వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. సత్తు షర్బత్ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లోకి వస్తాయి. కొవ్వు సమస్యతో బాధపడేవారు కూడా సత్తు పానీయాలను తాగాలి.