LOADING...
Quasi-Moon: భూమికి దగ్గరగా వస్తున్న '2025 PN7'.. రెండో చంద్రుడు!
భూమికి దగ్గరగా వస్తున్న '2025 PN7'.. రెండో చంద్రుడు!

Quasi-Moon: భూమికి దగ్గరగా వస్తున్న '2025 PN7'.. రెండో చంద్రుడు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2025
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇది ఒక చిన్న భవనం ఎత్తుతో పోల్చదగిన అతి చిన్న ఖగోళీయ వస్తువు. అంతరిక్ష ప్రమాణాల ప్రకారం ఇది చిన్నదైనప్పటికీ, భూమికి ఎంతో దగ్గరగా ఉండటం విశేషం. ఇది మన చంద్రుడి గురుత్వాకర్షణ శక్తికి బంధించబడలేదు, కానీ శాస్త్రవేత్తల ప్రకారం, ఒకే ట్రాక్‌లో మనతో పరుగు తీస్తున్న 'స్నేహపూర్వక రన్నర్'లా ఉంటుంది. '2025 PN7' సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు భూమిని అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం, గత 60 సంవత్సరాలుగా ఇది భూమితో దాదాపు ఒకే వేగం, ఒకే కక్ష్యంలో ప్రయాణిస్తోంది. ప్రస్తుత కక్ష్య స్థిరంగా ఉంటే 2083 వరకు మనతోనే ఉండగలదు.

Details

చంద్రుడి దూరం కంటే 10 రెట్లు ఎక్కువ

ఆ తర్వాత ఇది అంతరిక్షంలోకి వెళ్ళిపోవడం సాధ్యమే. భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు దీని దూరం 40 లక్షల కిలోమీటర్లుగా ఉంటుంది, ఇది చంద్రుడు దూరం కంటే 10 రెట్లు ఎక్కువ. సూర్యుడు మరియు ఇతర గ్రహాల గురుత్వాకర్షణ ప్రభావంతో ఇది 1.7 కోట్ల కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. క్వాసీ మూన్స్‌ చాలా అరుదైనవి. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కేవలం ఎనిమిదింటిని మాత్రమే గుర్తించారు. ఈ గ్రహశకలాలు భూమి గురుత్వాకర్షణ ప్రభావాలను అధ్యయనం చేయడంలో, అంతరిక్ష విజ్ఞానానికి ఉపయోగపడతాయి.