
Google: గూగుల్‌కు పాతికేళ్లు.. ప్రత్యేక డూడుల్ షేర్ చేసిన సెర్చ్ ఇంజిన్
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ లేకుంటే రోజు గడవని కాలంలో మనం జీవిస్తున్నాం.
ప్రపంచంలోని ఏ మూలనైనా సెర్చ్ ఇంజిన్, జీమెయిల్, గూగుల్ ఫోటోస్, మ్యాప్స్ లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైంది.
ఏ సందేహం వచ్చినా గూగుల్‌ను ఆడగటం పరిపాటైంది. అలాంటి గూగుల్ స్థాపించి నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా 'G25gle' అనే ప్రత్యేక డూడుల్‌ను షేర్ చేసింది.
భవిష్యత్తు కోసమే గూగుల్ రూపుదిద్దుకుంటుందని, పుట్టినరోజులు కేవలం కాలాన్ని మాత్రమే గుర్తు చేస్తాయని గూగుల్ పేర్కొంది.
Details
గూగుల్
1990లో లారీ పేజ్, సెర్గీ బ్రిన్ లు వరల్డ్ వైడ్ వెబ్‌ను ఎక్కువ మందికి చేరువ చేయాలనే లక్ష్యంతో సెర్చ్ ఇంజిన్ కోసం తీవ్రంగా శ్రమించారు.
సెప్టెంబర్ 27న 1998న గూగుల్ సంస్థను స్థాపించారు. 25 ఏళ్ల కాలంలో గూగుల్ లోగోలు చాలాసార్లు మారాయి.
ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది తమ అవసరాల కోసం గూగుల్‌ను ఉపయోగిస్తున్నారు.
25 ఏళ్ల పాటు తమతో కలిసి ప్రయాణించినందుకు ధన్యావాదాలు అని, భవిష్యత్ ప్రయాణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తామని గూగుల్ డూడుల్ పేజ్‌లో రాసుకొచ్చింది.