PDF to Word: పీడీఎఫ్ ఫైల్‌ను వర్డ్ డాక్యుమెంట్‌గా మార్చాలా? అయితే ఈ టిప్స్ మీకోసం..
ఈ వార్తాకథనం ఏంటి
పీడీఎఫ్ (PDF) ఫైళ్లను వర్డ్ (Word) డాక్యుమెంట్లుగా మార్చుకోవడం చాలా సందర్భాల్లో అవసరం అవుతుంది. ముఖ్యంగా డాక్యుమెంట్‌లో మార్పులు చేయాలి, టెక్స్ట్ ఎడిట్ చేయాలి అనుకుంటే ఇది ఉపయోగపడుతుంది. అయితే దీనికి కోసం కొన్ని టూల్స్ డబ్బులు తీసుకోవచ్చు లేదా మార్చిన తర్వాత ఫార్మాటింగ్ సరిగా ఉండకపోవచ్చు. కానీ ఒక రూపాయి ఖర్చు లేకుండా కూడా పీడీఎఫ్ ఫైళ్లను వర్డ్ డాక్యుమెంట్లుగా మార్చే సులభమైన పద్ధతులు ఉన్నాయి. అలాంటి ఐదు మార్గాలు ఇవి.
డ్రైవ్ పద్ధతి
గూగుల్ డ్రైవ్‌తో సులభంగా మార్పు
గూగుల్ డ్రైవ్ ద్వారా పీడీఎఫ్ ఫైళ్లను వర్డ్ డాక్యుమెంట్లుగా మార్చడం చాలా సులభం. ముందుగా మీ పీడీఎఫ్ ఫైల్‌ను గూగుల్ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఆ ఫైల్‌పై రైట్-క్లిక్ చేసి "Open With" → "Google Docs" ఎంపిక చేయాలి. అప్పుడు ఆ ఫైల్ గూగుల్ డాక్స్‌లో ఎడిట్ చేయగలిగే టెక్స్ట్‌గా ఓపెన్ అవుతుంది. తర్వాత File → Download → Microsoft Word (.docx) ఎంపిక చేసి వర్డ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ టూల్స్
ఆన్‌లైన్ టూల్స్ ఉపయోగించండి
ఇంటర్నెట్‌లో పీడీఎఫ్‌ను వర్డ్‌గా మార్చే అనేక ఉచిత వెబ్‌సైట్లు ఉన్నాయి. Smallpdf, PDF to Word Converter వంటి సైట్లలో మీ పీడీఎఫ్ ఫైల్‌ను అప్‌లోడ్ చేస్తే, కొన్ని నిమిషాల్లోనే వర్డ్ ఫైల్‌గా మార్చి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ టూల్స్ సాధారణంగా డాక్యుమెంట్ ఫార్మాటింగ్‌ను అలాగే ఉంచడంలో బాగా సహాయపడతాయి.
వర్డ్ ఫీచర్
మైక్రోసాఫ్ట్ వర్డ్‌లోనే ఓపెన్ చేయండి
మీ కంప్యూటర్‌లో Microsoft Word ఉంటే, పీడీఎఫ్ ఫైల్‌ను నేరుగా వర్డ్‌లోనే ఓపెన్ చేయవచ్చు. వర్డ్‌ను ఓపెన్ చేసి File → Openలో మీ పీడీఎఫ్ ఫైల్‌ను ఎంచుకుంటే, వర్డ్ దానిని ఆటోమేటిక్‌గా ఎడిట్ చేయగలిగే ఫార్మాట్‌గా మార్చుతుంది. అయితే క్లిష్టమైన లేఅవుట్లు లేదా గ్రాఫిక్స్ ఉన్న ఫైళ్లలో ఫార్మాటింగ్ పూర్తిగా అలాగే ఉండకపోవచ్చు.
అక్రోబాట్ రీడర్ పద్ధతి
అడోబ్ అక్రోబాట్ రీడర్ ఉపయోగించండి
పీడీఎఫ్ ఫైళ్లకు ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్‌వేర్ Adobe Acrobat Reader. ఇందులో పీడీఎఫ్ ఫైల్‌ను వర్డ్ డాక్యుమెంట్‌గా Export చేసే ఫీచర్ ఉంటుంది. కానీ ఇది సాధారణంగా పెయిడ్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీ వద్ద ఈ సాఫ్ట్‌వేర్ ఇప్పటికే ఉంటే, పీడీఎఫ్ ఫైళ్లను వర్డ్‌గా మార్చడానికి ఇది ఒక సులభమైన మార్గం.
లిబ్రెఆఫీస్ పద్ధతి
లిబ్రెఆఫీస్‌తో కూడా మార్చవచ్చు
LibreOffice అనేది ఉచితంగా లభించే ఓపెన్ సోర్స్ ఆఫీస్ సూట్. ఇందులోని LibreOffice Draw ద్వారా పీడీఎఫ్ ఫైల్‌ను ఓపెన్ చేసి ఎడిట్ చేయవచ్చు. అవసరమైన మార్పులు చేసిన తర్వాత ఫైల్‌ను మళ్లీ సేవ్ చేసేటప్పుడు వర్డ్‌కు అనుకూలమైన ఫార్మాట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధానం కూడా పూర్తిగా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.