NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / WhatsApp : భారత్‌లో 99.67 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్‌.. కారణమిదే?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    WhatsApp : భారత్‌లో 99.67 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్‌.. కారణమిదే?
    భారత్‌లో 99.67 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్‌.. కారణమిదే?

    WhatsApp : భారత్‌లో 99.67 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్‌.. కారణమిదే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 22, 2025
    03:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) జనవరి 2025లో 99.67 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించింది.

    ఈ ఖాతాల్లో 13.27 లక్షల అకౌంట్లను వినియోగదారుల నుంచి ఫిర్యాదు లేకుండానే నిలిపివేశారని కంపెనీ వెల్లడించింది.

    ప్లాట్‌ఫారమ్ భద్రతను బలోపేతం చేయడానికి, స్పామ్‌, స్కామ్‌లను నిరోధించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్‌ తెలిపింది.

    ఖాతాలను ఎందుకు నిషేధించారు?

    వాట్సాప్‌ ప్రకారం 2021 ఐటీ నిబంధనలను ఉల్లంఘించిన ఖాతాలను నిలిపివేశారు.

    నిషేధానికి కారణమైన ప్రధాన అంశాలు

    స్పామ్‌ మెసేజీలు పంపడం

    చట్టవిరుద్ధ సందేశాలు, నకిలీ వార్తలు షేర్‌ చేయడం

    మోసపూరిత లావాదేవీల్లో పాల్గొనడం

    తప్పుదారి పట్టించే సమాచారం వ్యాప్తి చేయడం

    చట్టవిరుద్ధ కంటెంట్‌ పంపడం

    Details

    వాట్సాప్ భద్రతా వ్యవస్థ 

    వాట్సాప్ మూడు అంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తోంది 1.రిజిస్ట్రేషన్ సమయంలో ఖాతా ధృవీకరణ

    ఖాతా క్రియేట్‌ చేసే సమయంలో ధృవీకరించే ప్రక్రియ. 2. అనుమానాస్పద ఖాతాలను బ్లాక్‌ చేయడం

    స్పామ్‌ లేదా అనుమానాస్పద ప్రవర్తనను గుర్తించి ఖాతాను తక్షణమే బ్లాక్ చేస్తారు.

    3. స్పామ్ సందేశాలను ట్రాక్ చేయడం

    పెద్ద సంఖ్యలో సందేశాలు పంపే ఖాతాలను ట్రాక్ చేసి నిలిపివేస్తారు. వినియోగదారులు ఒక ఖాతాను బ్లాక్ చేస్తే, వాట్సాప్ ఆ ఖాతాను నిశితంగా పరిశీలిస్తుంది

    Details

    మీ ఖాతా బ్లాక్ కాకుండా ఉండాలంటే 

    స్పామ్‌ లేదా బల్క్‌ మెసేజింగ్‌ పంపకండి

    తప్పుదారి పట్టించే లేదా నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దు.

    చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను షేర్ చేయడాన్ని నివారించండి.

    అనుమానాస్పద మెసేజ్ వస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి.

    వాట్సాప్‌ భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే ఖాతా నిలిపివేయబడే ప్రమాదం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వాట్సాప్

    తాజా

    Operation Sindoor: భారత్,పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. డ్రోన్ దాడి జరిగే అవకాశం ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ గుజరాత్
    Exams: భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో .. నేటి నుంచి జరగాల్సిన పరీక్షలు రద్దు పరీక్షలు
    Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్‌.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు జమ్ముకశ్మీర్

    వాట్సాప్

    Whatsapp: వాట్సాప్ చాట్ బార్‌లో కొత్త షార్ట్‌కట్‌.. ఎలా ఉపయోగించాలంటే? టెక్నాలజీ
    Whatsapp accounts: 85 లక్షల భారతీయుల ఖాతాలపై నిషేధం విధించిన వాట్సప్‌ మెటా
    Whatsapp: వాట్సాప్‌లో లో-లైట్ మోడ్ ఫీచర్‌ను ఉపయోగించడం సులభం.. ఎలాగంటే? టెక్నాలజీ
    WhatsApp: ఇక ఫేక్ ఫోటోలకు చెక్.. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025