LOADING...
NASA: ఆకాశాన్ని తాకిన అందం.. లిరిడ్ మీటియర్ షవర్‌ను అంతరిక్షం నుంచి చిత్రీకరించిన నాసా
ఆకాశాన్ని తాకిన అందం.. లిరిడ్ మీటియర్ షవర్‌ను అంతరిక్షం నుంచి చిత్రీకరించిన నాసా

NASA: ఆకాశాన్ని తాకిన అందం.. లిరిడ్ మీటియర్ షవర్‌ను అంతరిక్షం నుంచి చిత్రీకరించిన నాసా

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 21, 2026
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

నాసాకు చెందిన వ్యోమగామి జెస్సికా మీర్ అంతరిక్షం నుంచి కనిపించిన అద్భుతమైన మీటియర్ షవర్ దృశ్యాన్ని పంచుకోవడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం జరుగుతున్న లిరిడ్ ఉల్కాపాతంను అంతరిక్షం నుంచి చిత్రీకరించిన అరుదైన దృశ్యమిది. జెస్సికా మీర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని కుపోలా (Cupola) నుంచి ఈ "షూటింగ్ స్టార్స్"ను ఫోటోలు తీశారు. ప్రతేడాది జరిగే లిరిడ్ మీటియర్ షవర్ ప్రస్తుతం కొనసాగుతోందని ఆమె తెలిపారు. ముఖ్యంగా ఉత్తర అర్ధగోళంలో ఉన్నవారు తూర్పు దిశలోని లైరా నక్షత్రరాశి వైపు చూడటం ద్వారా ఈ అద్భుతాన్ని ఆస్వాదించవచ్చని సూచించారు.

వివరాలు

ఫోటో వివరాలివే

ఈ మీటియర్ షవర్ ఏప్రిల్ 21 నుంచి 22 మధ్య పీక్‌కి చేరుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సమయంలో ఆకాశాన్ని గమనిస్తే మరింత స్పష్టంగా షూటింగ్ స్టార్స్ కనిపించే అవకాశం ఉందన్నారు. స్కైవాచ్ చేయాలని జెస్సికా ప్రజలను ప్రోత్సహించారు. ఆకాశాన్ని గమనించే వారు అదృష్టవశాత్తూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా దూసుకెళ్తున్న దృశ్యాన్ని చూడవచ్చని తెలిపారు. తాను షేర్ చేసిన ఫోటోను 3 సెకన్ల ఎక్స్‌పోజర్‌తో తీసినట్లు జెస్సికా వివరించారు. దీని వల్ల చిత్రంలో కుడివైపున ఉన్న నగర దీపాలు రేఖల్లా కనిపించగా, ఎడమవైపున హరైజన్ దగ్గర ఒక మీటియర్ స్పష్టంగా స్ట్రీక్‌లా కనిపిస్తోందని తెలిపారు. ఈ అరుదైన దృశ్యం అంతరిక్షం నుంచి మనకు కనిపించే విశ్వ సౌందర్యాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.

Advertisement