NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / OpenAI: కృత్రిమ మేధలో కొత్త యుగం.. ఓపెన్‌ఏఐ ఏఐ ఏజెంట్‌ సేవలు ప్రారంభం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    OpenAI: కృత్రిమ మేధలో కొత్త యుగం.. ఓపెన్‌ఏఐ ఏఐ ఏజెంట్‌ సేవలు ప్రారంభం!
    కృత్రిమ మేధలో కొత్త యుగం.. ఓపెన్‌ఏఐ ఏఐ ఏజెంట్‌ సేవలు ప్రారంభం!

    OpenAI: కృత్రిమ మేధలో కొత్త యుగం.. ఓపెన్‌ఏఐ ఏఐ ఏజెంట్‌ సేవలు ప్రారంభం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 22, 2025
    11:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఓపెన్‌ఏఐ ప్రపంచానికి చాట్‌జీపీటీని పరిచయం చేసి, ఏఐ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.

    కృత్రిమ మేధను మరింత అభివృద్ధి చేసే దిశగా, తాజాగా 'ఏఐ ఏజెంట్‌' అనే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

    వర్చువల్ సాయంగా మారే ఈ ఏఐ ఏజెంట్లు, వినియోగదారుల ప్రాంప్ట్‌ల ఆధారంగా ఆన్‌లైన్‌లో ఆటోమెటిక్‌గా పనులను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

    ప్రస్తుతం ఈ సేవలు అమెరికాలో చాట్‌జీపీటీ ప్రో యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, తాజాగా భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, యూకే దేశాల్లోనూ ఈ సేవలు ప్రారంభమయ్యాయి.

    అయితే ఐరోపా దేశాల్లో ఈ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదని, త్వరలో అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఓపెన్‌ఏఐ వెల్లడించింది.

    Details

    కంప్యూటర్‌-యూజింగ్‌ ఏజెంట్‌ ఆధారంగా పనులు

    ఈ ఏఐ ఏజెంట్‌ సంక్లిష్టమైన ఆన్‌లైన్‌ పనులను స్వతంత్రంగా నిర్వహించగలదు. ఇది 'కంప్యూటర్‌-యూజింగ్‌ ఏజెంట్‌' ఆధారంగా పని చేస్తుంది.

    జీపీటీ-4o, o3 మోడళ్ల ఆధునిక నైపుణ్యాలతో రూపొందించిన ఈ ఏఐ, ప్రత్యేక బ్రౌజర్‌లో పని చేస్తుంది.

    యూజర్లు ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఇది స్వతంత్రంగా పని చేయగలదు.

    టెక్ట్స్‌, ఇమేజ్‌ తరహా ఇన్‌పుట్‌లను స్వీకరించి, లోపాలను సరిదిద్దడం, అనుకోని సవాళ్లను ఎదుర్కోవడం, ఉత్పాదకతను పెంచడం లాంటి పనులను సమర్థవంతంగా నిర్వహించగలదు.

    Details

    మానవుల ప్రమేయం అవసరం

    ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ ఈ ఏఐ ఏజెంట్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సాయంగా మారగలవని, వారికి కేటాయించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలవని తెలిపారు.

    అయితే స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం వీటికి లేదని, మానవుల ప్రమేయం అవసరమేనని స్పష్టం చేశారు.

    దీర్ఘకాలంలో విజ్ఞానానికి సంబంధించిన అన్ని రంగాల్లో ఏఐ ఏజెంట్లు ప్రాముఖ్యత పొందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓపెన్ఏఐ
    చాట్‌జీపీటీ
    గూగుల్

    తాజా

    IMF: యుద్దం వేళ.. పాకిస్తాన్ కు IMF 1 బిలియన్ డాలర్ల రుణం మంజూరు..  పాకిస్థాన్
    Pak drone attacks: 20 నగరాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. సమర్థవంతంగా అడ్డుకున్న భారత సైన్యం.. ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: భారత్‌పై పాక్ డ్రోన్ల దాడి.. స్పందించిన డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్
    Pak Drone Attack: ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గరికి తీవ్ర గాయాలు  భారతదేశం

    ఓపెన్ఏఐ

    OpenAI: క్యాన్సర్ స్క్రీనింగ్,చికిత్సను మెరుగుపరచడానికి OpenAI GPT-4o-ఆధారిత AI సాధనం క్యాన్సర్
    OpenAI GPT-4oని తీసుకోవడానికి ఆంత్రోపిక్ క్లాడ్ 3.5 సొనెట్‌ను ప్రారంభించింది టెక్నాలజీ
    OpenAI MacOS కోసం ChatGPT యాప్‌ను ప్రారంభించింది ఆపిల్
    ChatGPT వాయిస్ అసిస్టెంట్ ఆలస్యంగా ప్రారంభమవుతుంది.. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే  చాట్‌జీపీటీ

    చాట్‌జీపీటీ

    చాట్‌జీటీపీ లాంటి ఇంటర్‌ఫేస్‌ను రెడీ చేసే పనిలో నాసా  నాసా
    చాట్‌జీపీటీతో టీచర్ కోలువులు గోవిందా..! ప్రపంచం
    ఇకపై తెలుగులోనూ ఏఐ చాట్‌బోట్‌.. అందుబాటులోకి గూగుల్‌ బార్డ్‌ సేవలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OpenAI Sam Altman: షాకింగ్ న్యూస్.. 'ఓపెన్‌ఎఐ' సీఈఓ పదవి నుంచి సామ్ ఆల్ట్‌మన్ తొలగింపు  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    గూగుల్

    Android 15 update: ఆండ్రాయిడ్ 15 అప్డేట్ : ఏ యే ఫోన్లకు అందుబాటులో ఉంది? ఎలా అప్డేట్ చేయాలి? వివరాలు ఆండ్రాయిడ్
    Google: గూగుల్ కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్‌.. ప్రభాకర్ రాఘవన్‌..ఆయన ఎవరో తెలుసా? టెక్నాలజీ
    Google Techie: గూగుల్ టెక్కీకి చేదు అనుభవం .. ఇంటర్నెట్ లో పెద్ద ఎత్తున చర్చ లైఫ్-స్టైల్
    Google: గూగుల్ ఫోటోలలో కొత్త ఫీచర్.. AIతో రూపొందించిన చిత్రాలను వినియోగదారులు సులభంగా గుర్తించగలరు టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025