Instants : ఫోటో షేరింగ్‌లో కొత్త ట్రెండ్.. ఇన్‌స్టంట్స్ యాప్ ఎలా పని చేస్తుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను అందంగా మార్చేందుకు ఫిల్టర్లు, ఎడిటింగ్ టూల్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే 'ఇన్‌స్టంట్స్' అనే కొత్త ఫీచర్/యాప్ మాత్రం ఈ విధానానికి పూర్తిగా భిన్నంగా ఉండనుంది. ఇది సహజత్వాన్ని ప్రోత్సహించేలా రూపొందించారు. ఈ యాప్‌లో తీసిన ఫోటోలను ఎడిట్ చేయడం లేదా ఫిల్టర్లు జోడించడం సాధ్యం కాదు. కేవలం సాదాసీదా టెక్స్ట్ మాత్రమే జోడించవచ్చు. అలాగే, ఫోన్ గ్యాలరీలో ముందే ఉన్న ఫోటోలను ఇందులో షేర్ చేయడం కుదరదు. యాప్‌లోని కెమెరాతో అప్పటికప్పుడు ఫోటో తీసి పంపాల్సిందే. ఇంకా ఒక ప్రత్యేకత ఏమిటంటే, మీరు పంపిన ఫోటోలను అవతలి వ్యక్తి ఒక్కసారి మాత్రమే చూడగలరు. ఆ తర్వాత 24 గంటల్లో అవి ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి.
వివరాలు
భారత్ లో ఇంకా అందుబాటులోకి రాలేదు
అలాగే, మీరు ఫాలో అయ్యే వారు మరియు మిమ్మల్ని ఫాలో అయ్యే వారితో మాత్రమే ఈ ఫోటోలను పంచుకునే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో 'పర్ఫెక్ట్' ఫోటోలు పోస్ట్ చేయాలనే ఒత్తిడిని తగ్గించడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యమని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. స్నేహితులతో సహజమైన, హంగులు లేని ఫోటోలను సులభంగా పంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌ల్లో కనిపిస్తున్నప్పటికీ, భారత్ వంటి మార్కెట్లలో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఇంకా అందుబాటులో లేదు. స్నాప్‌చాట్‌కు గట్టి పోటీగా రూపొందించిన ఈ ఫీచర్ త్వరలోనే ప్రధాన ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో భాగంగా కూడా ప్రవేశించే అవకాశముంది.