తదుపరి వార్తా కథనం
DRDO: హైపర్‌సానిక్ క్షిపణుల్లో ముందడుగు.. స్క్రాంజెట్ ఇంజిన్ టెస్ట్ సక్సెస్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 22, 2025
09:04 am
ఈ వార్తాకథనం ఏంటి
హైపర్‌సానిక్ క్షిపణుల తయారీలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
తదుపరి తరం క్షిపణుల్లో వినియోగించే దీర్ఘకాలిక సూపర్‌సానిక్ కంబషన్ రాంజెట్ (స్క్రాంజెట్) ఇంజిన్ గ్రౌండ్ టెస్ట్ విజయవంతంగా పూర్తయినట్లు రక్షణ శాఖ మంగళవారం ధ్రువీకరించింది.
ఈ స్క్రాంజెట్ ఇంజిన్‌ను హైదరాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్‌డీఎల్), డీఆర్డీవో ముఖ్యమైన విభాగంగా, అభివృద్ధి చేసింది.
Details
ధ్వని వేగానికి ఐదింతల వేగంతో ముందుకు
భారతదేశంలో మొదటిసారి 120 సెకన్ల పాటు స్క్రాంజెట్ గ్రౌండ్ టెస్ట్ నిర్వహించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
ఈ టెస్ట్‌లో అన్ని ప్రమాణాలు విజయవంతంగా పూర్తయినట్లు ప్రకటించారు.
హైపర్‌సానిక్ క్షిపణులు అత్యాధునికమైన ఆయుధాలు అని, మాక్ 5కు మించిన వేగంతో ప్రయాణించగలవని స్పష్టం చేశారు.
అంటే ఇవి ధ్వని వేగానికి ఐదింతల వేగంతో ముందుకు సాగుతాయి.