Page Loader
Acer Swift Neo: ఏసర్ స్విఫ్ట్ నియో ల్యాప్‌టాప్ విడుదల.. 14 అంగుళాల OLED డిస్‌ప్లే, 8.5 గంటల బ్యాటరీ లైఫ్ 
ఏసర్ స్విఫ్ట్ నియో ల్యాప్‌టాప్ విడుదల.. 14 అంగుళాల OLED డిస్‌ప్లే, 8.5 గంటల బ్యాటరీ లైఫ్

Acer Swift Neo: ఏసర్ స్విఫ్ట్ నియో ల్యాప్‌టాప్ విడుదల.. 14 అంగుళాల OLED డిస్‌ప్లే, 8.5 గంటల బ్యాటరీ లైఫ్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 24, 2025
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏసర్ తాజాగా భారత మార్కెట్‌లోకి తన కొత్త ల్యాప్‌ టాప్ 'స్విఫ్ట్ నియో'ని విడుదల చేసింది. శక్తివంతమైన ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్, ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్‌తో ఇది వచ్చిన ఈ ల్యాప్‌టాప్, అధునాతన AI ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. 32GB LPDDR5 RAM, 1TB NVMe PCIe Gen 4 SSD స్టోరేజ్‌ను కలిగి ఉన్న ఈ డివైస్ రూ.61,990కు ఫ్లిప్‌కార్ట్, ఏసర్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంది. ఇది రోజ్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది.

Details

 ప్రధాన స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే : 14-అంగుళాల WUXGA OLED స్క్రీన్ (1920x1200 పిక్సెల్స్) 92% NTSC, 100% sRGB కలర్ గామట్ కవరేజ్ ప్రాసెసర్ : ఇంటెల్ కోర్ అల్ట్రా 5 CPU గ్రాఫిక్స్ : ఇంటెల్ ఆర్క్ RAM & స్టోరేజ్ : 32GB RAM, 1TB SSD వెబ్‌క్యామ్ : 1080p ఫుల్ HD ఆపరేటింగ్ సిస్టమ్ : Windows 11 హోమ్ (64-bit)

Details

ప్రత్యేకతలివే

కోపిలట్, ఇంటెల్ AI బూస్ట్ సపోర్ట్ డైమండ్-కట్ టచ్‌ప్యాడ్ బ్యాక్‌లిట్ కీబోర్డ్, కోపైలట్ డెడికేటెడ్ కీలతో ఫింగర్‌ప్రింట్ రీడర్, ఒకే చేతితో తెరవగలిగే హింజ్ ఆన్-డివైస్ AI ప్రాసెసింగ్‌తో వీడియో కాలింగ్ యాప్‌లు సెక్యూర్డ్-కోర్ PC రక్షణ, బయోమెట్రిక్ ప్రామాణీకరణ Wi-Fi 6, Bluetooth 5.2, HDMI, డ్యూయల్ USB Type-C పోర్టులు

Details

బ్యాటరీ & ఛార్జింగ్

55Wh బ్యాటరీ * 65W ఛార్జింగ్‌కు మద్దతు ఒకసారి ఛార్జ్ చేస్తే 8.5 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఈ ల్యాప్‌టాప్ అధిక రిజల్యూషన్ వీడియో ఎడిటింగ్, మల్టీటాస్కింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. కొత్త-age పనికిరావలసిన సౌకర్యాలన్నీ ఇందులో అందుబాటులో ఉన్నాయి.