LOADING...
AI content: ఏఐ కంటెంట్‌ను తప్పనిసరిగా గుర్తించాలి.. కేంద్రం కీలక ఆదేశాలు
ఏఐ కంటెంట్‌ను తప్పనిసరిగా గుర్తించాలి.. కేంద్రం కీలక ఆదేశాలు

AI content: ఏఐ కంటెంట్‌ను తప్పనిసరిగా గుర్తించాలి.. కేంద్రం కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2026
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ద్వారా రూపొందిన కంటెంట్‌పై కొత్త నియమాలను ప్రకటించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఏఐ జనరేటెడ్ కంటెంట్‌కు తప్పనిసరిగా లేబుల్ వేయాలని కేంద్రం ఆదేశించింది. వినియోగదారులు ఏఐ ద్వారా రూపొందిన కంటెంట్‌ను సులువుగా గుర్తించగలిగేలా ఈ లేబుల్ ఉండాలి. ఒకసారి లేబుల్ పెట్టిన తర్వాత, దాన్ని గాని, మెటా డేటాను గాని తొలగించడానికి, దాచడానికి వీలు ఉండకూడదని స్పష్టం చేసింది. అదనంగా చట్టవిరుద్ధమైన, అసభ్య, మోసపూరిత ఏఐ కంటెంట్‌ను నిరోధించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఆటోమేటెడ్ సాధనాలను అందుబాటులో ఉంచాలని కేంద్రం సూచించింది.

Details

మూడు గంటల్లోగా తొలగించేలా గడువు

ఏఐ కంటెంట్‌ను దుర్వినియోగం చేసినవారికి పడే శిక్షల, పెనాల్టీల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి యూజర్‌లకు సందేశాలు పంపాలని ఆదేశించింది. అంతేకాక, ఏఐ లేదా డీప్‌ఫేక్ కంటెంట్‌ను తొలగించాలని ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశిస్తే, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఆ కంటెంట్‌ను మూడు గంటల్లోనే తొలగించేలా గడువు విధించబడింది.

Advertisement