Sundar Pichai: వచ్చే 5 ఏళ్లలో క్వాంటమ్ దే రాజ్యం.. సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
గత అయిదేళ్ల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్నిఊపేసింది. ఇప్పుడు మరోసరి టెక్ రంగంలో అద్భుతాలు సృష్టించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో గూగుల్ CEO సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. ,"క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఇప్పుడు, అయిదేళ్ల క్రితం AI ఎక్కడ ఉందో అదే స్థాయికి చేరుతోంది" అని చెప్పారు. ఇటీవల BBC న్యూస్‌నైట్‌లో వచ్చిన ఇంటర్వ్యూలో పిచాయ్ మాట్లాడుతూ,గూగుల్ క్వాంటమ్ ప్రోగ్రామ్ ఇప్పుడు కీలక దశలో ఉందన్నారు. "ఇంకో అయిదేళ్లలో క్వాంటమ్ రంగంలో చాలా ఎగ్జైటింగ్ ఫేజ్‌లోకి వెళ్లబోతున్నాం"అని ఆయన చెప్పారు. ఈ దిశగా గూగుల్ భారీ పెట్టుబడులు పెడుతోందని కూడా స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో, తదుపరి"AI-లెవెల్ బూమ్" ఎప్పుడు వస్తుందో అంటూ ఇన్వెస్టర్లు సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు.
వివరాలు
క్వాంటమ్ కంప్యూటింగ్ అసలు ఏమి చేయగలదు?
అయితే క్వాంటమ్ కంప్యూటింగ్ అసలు ఏమి చేయగలదు? పిచాయ్ మాటల్లో ఇది సాధారణ టెక్ అప్‌గ్రేడ్ కాదు, అసలు వ్యవస్థనే మార్చేస్తుందన్నారు. "ప్రకృతి, విశ్వం.. ఇవి అన్నీ క్వాంటమ్ మెకానిక్స్‌పై ఆధారపడి ఉంటాయి కాబట్టి, క్వాంటమ్ సిస్టమ్స్ నిర్మించడం వలన మనం ప్రకృతిని మరింతగా అర్థం చేసుకోగలం. సమాజానికి కూడా పెద్ద ప్రయోజనాలు వస్తాయి" అని ఆయన వివరించారు. క్వాంటమ్ వాణిజ్య దశకి చేరువలో ఉందన్న టైమ్‌లైన్‌ను బిగ్ టెక్ CEO స్వయంగా చెప్పడం, గూగుల్ తాజాగా రూపొందించిన "క్వాంటమ్ ఎకోస్" ఆల్గోరిథమ్ నేపథ్యంలోనే వచ్చింది. ఇది "విల్లో" అనే వారి క్వాంటమ్ చిప్‌పై పనిచేస్తోంది. ఈ సిస్టమ్ సాధారణ సూపర్‌కంప్యూటర్లకంటే వేగంగా పనులు చేయగలదని గూగుల్ చెబుతోంది.
వివరాలు
సోషల్ మీడియాలో క్వాంటమ్ భవిష్యత్తుపై నెటిజన్లు, ఇన్వెస్టర్లు చర్చలు
ఇదిలా ఉంటే,క్వాంటమ్ భవిష్యత్తుపై నెటిజన్లు, ఇన్వెస్టర్లు సోషల్ మీడియాలో తెగ చర్చలు చేస్తున్నారు. ఒకరు Xలో,"అది AI మొదటి సంకేతాలు ఇచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు... కానీ తర్వాత మార్కెట్ పెరిగిపోయింది. ఇప్పుడు CEOs ఇలా ఓపెన్‌గా మాట్లాడితే,బ్యాక్‌గ్రౌండ్‌లో పని పూర్తైపోయిందన్నమాట" అని పోస్ట్ చేశారు. మరో నెటిజన్ వ్యాఖ్యానిస్తూ,"సుందర్ చెప్పినట్టు,క్వాంటమ్ ఇప్పుడు 2020లో AI ఎక్కడ ఉందో అక్కడుంటే, ఇదీ అదే రేంజ్‌లో ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. AI నాలుగైదేళ్లలో ప్రపంచాన్ని మార్చేసింది. ఇప్పుడు క్వాంటమ్ ఎన్క్రిప్షన్,డ్రగ్ డిస్కవరీ,మెటీరియల్స్,లాజిస్టిక్స్.. అన్నిటినీ మార్చేస్తుంది" అన్నారు. "నా ప్రెడిక్షన్: 2020లు.. AI సాఫ్ట్‌వేర్ యుగం. 2030లు.. AI రోబోట్స్ యుగం.2040లు.. ఇదే చక్రం క్వాంటమ్‌తో రీపీట్ అవుతుంది" అని మరో నెటిజన్ తెలిపారు.