Loading...
Riemann Hypothesis AI: రీమాన్‌ హైపోథెసిస్‌పై ఏఐ సంచలనం.. 167 ఏళ్ల సమస్యకు పరిష్కారం!
రీమాన్‌ హైపోథెసిస్‌పై ఏఐ సంచలనం.. 167 ఏళ్ల సమస్యకు పరిష్కారం!

Riemann Hypothesis AI: రీమాన్‌ హైపోథెసిస్‌పై ఏఐ సంచలనం.. 167 ఏళ్ల సమస్యకు పరిష్కారం!

వ్రాసిన వారు Balachander Sharma
Nov 22, 2026
01:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

గణిత ప్రపంచాన్ని 167 ఏళ్లుగా వెంటాడుతున్న రీమాన్‌ హైపోథెసిస్‌పై సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆంత్రోపిక్‌ సంస్థకు చెందిన గణిత శాస్త్రవేత్త లెవెంట్‌ ఆల్పోగే ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నట్లు ప్రకటించారు. 1859లో ప్రతిపాదించిన ఈ సమస్య ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన గణిత సమస్యల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆల్పోగే ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మోడల్‌ క్లాడ్‌ సహాయంతో తన ఆలోచనలను అభివృద్ధి చేసినట్లు వివరించారు. అయితే ఇది నిజంగా పూర్తి పరిష్కారమా అనే విషయంపై గణిత నిపుణుల పరిశీలన ఇంకా కొనసాగుతోంది. అందుకే ప్రస్తుతానికి దీనిని తుది నిర్ధారణగా చూడటం లేదు.

Details

లీన్‌లో పరీక్షించిన గణిత పరిష్కారం

ఆల్పోగే తన పరిష్కారాన్ని లీన్‌ అనే ఓపెన్‌సోర్స్‌ ప్రోగ్రామింగ్‌ భాషలో రూపొందించారు.

గణిత సిద్ధాంతాలను కోడ్‌ రూపంలో వ్యక్తీకరించి, వాటిని కంప్యూటర్‌ ద్వారా అధికారికంగా ధృవీకరించేందుకు లీన్‌ను ఉపయోగిస్తారు.

ఆల్పోగే రూపొందించిన పరిష్కారం లీన్‌లో కంపైల్‌ అవుతోందని పలువురు గణిత శాస్త్రవేత్తలు తెలిపారు.

ఎంఐటీకి చెందిన ఆండ్రూ సదర్లాండ్‌ సహా కొందరు నిపుణులు కూడా దీన్ని విజయవంతంగా పరీక్షించినట్లు సమాచారం.

అయినప్పటికీ మొత్తం రుజువును మనుషులు పూర్తిగా అర్థం చేసుకుని, దాని ప్రతి దశను స్వతంత్రంగా పరిశీలించడం కీలకమైన తదుపరి దశగా మారింది.

Details

ఏఐ సహాయం.. కానీ అసలు పరీక్ష మనుషులదే

ఆల్పోగే తన ప్రయాణంలో క్లాడ్‌ కీలక పాత్ర పోషించిందని వివరించారు.

చిన్నప్పటి నుంచే రీమాన్‌ హైపోథెసిస్‌పై ఆసక్తి ఉన్న తనకు, ఏఐతో కలిసి పనిచేస్తూ చివరి దశకు చేరుకున్న అనుభవం ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని చెప్పారు.

అయితే కంప్యూటర్‌లో రుజువు నడవడం ఒక విషయం కాగా.. ఆ రుజువులోని ప్రతి గణిత ఆలోచనను మనుషులు అర్థం చేసుకోవడం మరో విషయం.

అందుకే గణిత సమాజం ఇప్పుడు ఈ పరిష్కారాన్ని లోతుగా పరిశీలిస్తోంది. పూర్తి స్థాయిలో అంగీకారం రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

ADVERTISEMENT

Details

అదే సమయంలో మానవ గణిత శాస్త్రవేత్త ప్రయత్నం

ఇదే సమయంలో స్టాన్‌ఫర్డ్‌కు చెందిన అలెస్సాండ్రో మసుల్లో కూడా రీమాన్‌ హైపోథెసిస్‌కు సంబంధించిన మరో రుజువును విడుదల చేశారు.

ఇది పూర్తిగా మానవ ప్రయత్నంతో రూపొందినదని స్టాన్‌ఫర్డ్‌ ప్రొఫెసర్‌ రవి వకీల్‌ పేర్కొన్నారు. మసుల్లో ఈ సమస్యపై 12 ఏళ్లుగా పనిచేసినట్లు తెలిపారు.

దీంతో ఒకవైపు ఏఐ సహాయంతో వచ్చిన పరిష్కారం, మరోవైపు మానవ మేధస్సుతో రూపొందిన రుజువు.. రెండూ ఒకేసారి చర్చలోకి వచ్చాయి.

చివరికి ఏది సరైనదో, రీమాన్‌ హైపోథెసిస్‌ నిజంగా పరిష్కారమైందో లేదో గణిత నిపుణుల పరిశీలన తర్వాతే స్పష్టత వస్తుంది.

ADVERTISEMENT