Loading...
AI Weapons Regulation: AI ఆయుధాల వినియోగంపై ఆందోళన.. ప్రపంచ దేశాలకు రెడ్‌క్రాస్ కీలక హెచ్చరిక
AI ఆయుధాల వినియోగంపై ఆందోళన.. ప్రపంచ దేశాలకు రెడ్‌క్రాస్ కీలక హెచ్చరిక

AI Weapons Regulation: AI ఆయుధాల వినియోగంపై ఆందోళన.. ప్రపంచ దేశాలకు రెడ్‌క్రాస్ కీలక హెచ్చరిక

వ్రాసిన వారు Balachander Sharma
Nov 23, 2026
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

యుద్ధ రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో స్వయంచాలక ఆయుధాలపై అంతర్జాతీయ నియంత్రణ అవసరం మరింత అత్యవసరంగా మారింది. ఈ విషయంలో ఆలస్యం చేస్తే పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ (ICRC) హెచ్చరించింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగిన సమావేశంలో 120కి పైగా దేశాలు పాల్గొన్నాయి. అయితే, ఈ ఆయుధాల నియంత్రణపై రెండేళ్ల పాటు చర్చలు జరపాలనే నిర్ణయమే వెలువడింది. తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్న మానవ హక్కుల సంఘాలకు ఇది నిరాశ కలిగించింది.

Details

యుద్ధంలో ఏఐతో పనిచేసే ఆయుధాల వినియోగం

స్వయంచాలక ఆయుధాలు అంటే మనిషి నేరుగా ఆదేశాలు ఇవ్వకుండానే ఏఐ లేదా రోబోటిక్ వ్యవస్థల సాయంతో లక్ష్యాలను గుర్తించి దాడి చేయగల ఆయుధాలు.

ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ వీటి సామర్థ్యాలు కూడా పెరుగుతున్నాయి.

ఇజ్రాయెల్‌ గాజా ప్రాంతంలో సైనిక లక్ష్యాలను గుర్తించేందుకు ఏఐ ఆధారిత వ్యవస్థలను ఉపయోగించినట్లు నివేదికలు వెల్లడించాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చివరి దశలోనూ లక్ష్యాన్ని వెంబడించగల సామర్థ్యం ఉన్న సెమీ ఆటోనమస్ డ్రోన్లు వినియోగంలోకి వచ్చాయి.

ఇవి యుద్ధంలో వేగాన్ని పెంచినా, తప్పు లక్ష్యాలను ఎంచుకునే ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది.

Details

స్పష్టమైన అంతర్జాతీయ చట్టాలు అవసరం

స్వయంచాలక ఆయుధాల వినియోగానికి సంబంధించి చట్టబద్ధమైన అంతర్జాతీయ ఒప్పందం తీసుకురావాలని రెడ్‌క్రాస్ అధ్యక్షురాలు మిర్జానా స్పోల్జారిక్ ఎగ్గర్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కోరారు.

ముఖ్యంగా మనుషులనే లక్ష్యంగా చేసుకునే స్వయంచాలక ఆయుధాలను నిషేధించాలని రెడ్‌క్రాస్ సూచిస్తోంది.

ఆయుధ వ్యవస్థల ప్రవర్తన ముందుగా అంచనా వేయగలిగేలా ఉండాలని, వాటి వినియోగాన్ని సైనిక లక్ష్యాలకే పరిమితం చేయాలని చెబుతోంది.

ఇప్పటికే ఈ ఆయుధాల వల్ల పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నమోదయ్యాయి.

జూలైలో ఉక్రెయిన్‌లోని జపొరిజ్జియా ప్రాంతంలో ఏఐ మార్గనిర్దేశం చేసిన రష్యా డ్రోన్ పెట్రోల్ బంక్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నంలో గోడను ఢీకొట్టింది.

ADVERTISEMENT