LOADING...
Airtel-Apple: ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు హోమ్ ఆపిల్ టీవీ +, ఆపిల్ మ్యూజిక్  సేవలు.. ప్లాన్‌ల ధరలు ఇవే..! 
ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు హోమ్ ఆపిల్ టీవీ +, ఆపిల్ మ్యూజిక్ సేవలు.. ప్లాన్‌ల ధరలు ఇవే..!

Airtel-Apple: ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు హోమ్ ఆపిల్ టీవీ +, ఆపిల్ మ్యూజిక్  సేవలు.. ప్లాన్‌ల ధరలు ఇవే..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ధ టెలికాం సంస్థ ఎయిర్‌ టెల్‌ (Airtel) కస్టమర్లకు మరింత మెరుగైన కంటెంట్ సేవలను అందించేందుకు మరో కీలక ముందడుగు వేసింది. తమ వినియోగదారులకు ఆపిల్‌ టీవీ+ ఆపిల్‌ మ్యూజిక్‌ కంటెంట్‌ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందుకోసం టెక్‌ దిగ్గజం ఆపిల్‌ (Apple)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్‌ సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ సదుపాయం ఎయిర్‌టెల్‌ వైఫై, పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లకు లభ్యం కానుంది. రూ.999 లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన ప్లాన్లను ఉపయోగించే వైఫై యూజర్లు ఆపిల్‌ టీవీ+ కంటెంట్‌ను వీక్షించవచ్చు.

వివరాలు 

అందుబాటులో ఉన్న ప్లాన్లు: 

అలాగే,పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులు అదే ప్లాన్ల ద్వారా ఆపిల్‌ టీవీ+ కంటెంట్‌తో పాటు అదనంగా ఆరు నెలల పాటు ఉచితంగా ఆపిల్‌ మ్యూజిక్‌ యాక్సెస్‌ను కూడా పొందవచ్చని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లు: రూ.999, రూ.1,199, రూ.1,399, రూ.1,749 వైఫై ప్లాన్లు: రూ.999, రూ.1,099, రూ.1,599, రూ.3,999 గత ఏడాది ఆగస్టులో కూడా ఎయిర్‌టెల్‌ సంస్థ ఆపిల్‌తో ఇదే విధమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ సమయంలో ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు ఆపిల్‌ టీవీ+,ఆపిల్‌ మ్యూజిక్‌ కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజా నిర్ణయంతో సాధారణ వైఫై,పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులు కూడా ఈ సేవలను పొందే అవకాశం ఉంది. దీని ద్వారా కస్టమర్లు హాలీవుడ్‌ చిత్రాలు,అవార్డు గెలుచుకున్న సినిమాలను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఆస్వాదించవచ్చు.