Alibaba: దుమ్మురేపుతున్న అలీబాబా 'క్వెన్'.. వారంలోనే 1 కోటి డౌన్‌లోడ్స్…
ఈ వార్తాకథనం ఏంటి
అలీబాబా కొత్తగా తీసుకొచ్చిన కృత్రిమ మేధస్సు (AI) యాప్ 'క్వెన్' లాంచ్ చేసిన వారం రోజుల్లోనే 1 కోటి డౌన్‌లోడ్స్ దాటింది. ఈ విజయంతో అలీబాబా హాంకాంగ్ షేర్లు సోమవారం 5% కంటే ఎక్కువ పెరిగాయి. చైనాలో వెస్ట్రన్ AI యాప్స్‌కి యాక్సెస్ పరిమితం కావడంతో, స్థానికంగా ఇలాంటి AI సేవలకు డిమాండ్ ఎంత పెరిగిందో ఈ స్పైక్ చూపిస్తోంది. అలీబాబా ఇటీవల తన పాత iOS, ఆండ్రాయిడ్ యాప్‌లన్నింటినీ ఒకేచోటికి తీసుకువచ్చి 'క్వెన్' పేరుతో రీబ్రాండ్ చేసిన విషయం వీచాట్ పోస్ట్‌లో వెల్లడించింది. గ్లోబల్ AI సర్వీసులకు పోటీగా ఒక స్థానిక ప్రత్యామ్నాయాన్ని తయారు చేయడం, అలాగే కన్యూమర్ ఎకోసిస్టమ్‌ని మరింత బలపరచడం కంపెనీ ప్రధాన ఉద్దేశ్యం.
వివరాలు
యాప్‌లో మరిన్ని అధునాతన ఫీచర్లు
లాంచ్ వెంటనే వచ్చిన ఈ భారీ రిస్పాన్స్‌తో,మెటా థ్రెడ్స్ తర్వాత వేగంగా పెరిగిన AI యాప్‌లలో క్వెన్ కూడా చేరింది. చైనాలో గ్లోబల్ యాప్స్‌కి యాక్సెస్ ఉండకపోవడంతో, స్థానిక యూజర్లు ప్రత్యామ్నాయాల కోసం చూసే పరిస్థితి క్వెన్‌కు మరింత ముందంజనిచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక వచ్చే నెలల్లో యాప్‌లో మరిన్ని అధునాతన ఫీచర్లను జోడించడానికి అలీబాబా ప్లాన్ చేస్తున్నది. భవిష్యత్తులో నావిగేషన్,ఫుడ్ డెలివరీ,ట్రావెల్ బుకింగ్, ఆఫీస్ వర్క్ టూల్స్, ఎడ్యుకేషన్, హెల్త్ అడ్వైస్ వంటి సేవలను కూడా క్వెన్‌లో అందించేలా చూస్తోంది. కంపెనీ. CEO ఎడ్డి వూ నాయకత్వంలో అలీబాబా "AI-ఫస్ట్" దిశగా అడుగులు వేస్తుండగా, ఈ యాప్‌కు వచ్చిన ప్రారంభ స్పందన కంపెనీ భవిష్యత్తు విలువను పెంచడంలో కీలకమవుతుందని విశ్లేషకుల అభిప్రాయం.