Amazon Home Robot: ఆస్ట్రో ఫెయిల్ అయినా తగ్గేదేలే.. కొత్త హోమ్ రోబోట్‌పై అమెజాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంట్లోనే మన పనుల్లో సాయం చేసే రోబోట్.. ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన ఆలోచన. ఇప్పుడు దానిని నిజం చేయాలని అమెజాన్ మరోసారి ప్రయత్నిస్తోంది. 2021లో $1,450 ధరతో తీసుకొచ్చిన Astro రోబోట్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా, కంపెనీ కొత్త హోమ్ రోబోట్‌పై పనిచేస్తోంది. CNBC పరిశీలించిన ఉద్యోగ నియామక వివరాల ప్రకారం.. అమెజాన్ గత కొన్ని నెలల్లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం పెట్టిన ఉద్యోగ ప్రకటనలో రోబోట్లు సినిమాల నుంచి బయటకు వచ్చి ఇళ్లలోకి అడుగుపెట్టే సమయం దగ్గరపడిందని పేర్కొన్నారు. కొత్త రోబోట్ ఇంట్లో మారుతూ ఉండే పరిస్థితులను గుర్తించి, కుటుంబ సభ్యుల మధ్య స్వతంత్రంగా పనిచేయగలగాలి.
Details
Fauna Roboticsతో మరింత బలమైన ప్లాన్
ఈసారి అమెజాన్ ప్రయత్నం కేవలం కొత్త పరికరం తయారు చేయడం వరకే పరిమితం కాలేదు.
మార్చిలో న్యూయార్క్‌కు చెందిన Fauna Roboticsను అమెజాన్ కొనుగోలు చేసింది. ఈ సంస్థ 3.5 అడుగుల ఎత్తైన Sprout అనే హ్యూమనాయిడ్ రోబోట్‌ను అభివృద్ధి చేసింది.
మరోవైపు Astro బృందంలోని చాలా మందిని కొత్త ప్రాజెక్ట్‌కు మార్చడంతో పాటు MITకి చెందిన రోబోటిక్స్ నిపుణుడిని కూడా నియమించింది.
అంటే ఈసారి ఇంటి రోబోట్‌ను సాధ్యమైనంత ఉపయోగకరంగా మార్చేందుకు అమెజాన్ సీరియస్‌గా పనిచేస్తోందన్నమాట.
అయితే ఇంటి వాతావరణం ఫ్యాక్టరీల కంటే పూర్తిగా భిన్నం. వస్తువులు, మనుషులు, పెంపుడు జంతువులు ఎప్పుడెలా మారతాయో చెప్పలేం కాబట్టి రోబోట్ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోవడం చాలా అవసరం
Details
AIతో హోమ్ రోబోట్ మార్కెట్ పెద్దదవుతుంది?
రోబోటిక్స్ అమెజాన్‌కు కొత్తేమీ కాదు. 2012లో $775 మిలియన్లకు Kiva Systemsను కొనుగోలు చేసిన కంపెనీ.. ప్రస్తుతం తన ఫుల్‌ఫిల్‌మెంట్ నెట్‌వర్క్‌లో 10 లక్షలకు పైగా రోబోట్లు ఉపయోగిస్తోంది.
ఇప్పుడు AI, సెన్సర్లు, బ్యాటరీలు, మెకానికల్ భాగాల్లో వచ్చిన అభివృద్ధి ఇంటి రోబోట్లకు కొత్త అవకాశాలు తెరిచింది.
Barclays అంచనా ప్రకారం ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్ మార్కెట్ ప్రస్తుత $2-3 బిలియన్ల నుంచి 2035 నాటికి సుమారు $40 బిలియన్లకు చేరొచ్చు.
అంటే అమెజాన్ చూస్తున్నది కేవలం మరో గాడ్జెట్ కాదు.. భవిష్యత్తులో ఇంటి పనుల్లో నిజంగా ఉపయోగపడే వ్యక్తిగత రోబోట్ మార్కెట్.