బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను ఆఫర్ చేసేందుకు సిద్ధమవుతున్న అమెజాన్... వివరాలు ఇవే
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను ఆఫర్ చేయడానికి సిద్ధమవుతోందని ఎకనామిక్ టైమ్స్ కథనాలు రాసుకొచ్చింది. అమెజాన్ కు చెందిన ప్రతినిధి ఎకనామిక్ టైమ్స్ తో మాట్లాడుతూ, అమెజాన్ తీసుకొస్తున్న బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను భారతదేశ వ్యాప్తంగా ప్రతీ గ్రామానికి అందజేయాలని భావిస్తున్నారట. ఈ సర్వీసుల ద్వారా అటు ప్రభుత్వము ఇటు ప్రజలు ప్రయోజనం పొందుతారు. భారతదేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించడానికి సిద్ధమవుతున్న అమెజాన్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ అనుమతి కోసం అప్లై చేసుకుందని సమాచారం.
ఆ కంపెనీలకు పోటీగా నిలవబోతున్న అమెజాన్
అంతేకాదు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఫర్ గ్లోబల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై సాటిలైట్ సర్వీసెస్(GMPCS) లైసెన్స్ కోసం అమెజాన్ అప్లై చేసిందని అంటున్నారు. బ్రాడ్ బ్యాండ్ మార్కెట్లోకి అమెజాన్ ఎంటరైతే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న భారతికి చెందిన వన్ వెబ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చెందిన జియో సాటిలైట్, ఎలాన్ మస్క్ కి చెందిన స్టార్ లింక్ వంటి సంస్థలకు పోటీదారుగా నిలుస్తుంది. పైన చెప్పుకున్న సంస్థల్లో వన్ వెబ్, జియో సాటిలైట్ సంస్థలకు GMPCS లైసెన్స్ ఉంది స్టార్ లింక్ సంస్థకు ఇంకా లైసెన్స్ రాలేదు.