LOADING...
Bitcoin: వింటర్ వేవ్‌కి రెడీ అవుతున్న అమెరికా.. హీటర్‌గా పనిచేస్తున్న బిట్‌కాయిన్ రిగ్స్
హీటర్‌గా పనిచేస్తున్న బిట్‌కాయిన్ రిగ్స్

Bitcoin: వింటర్ వేవ్‌కి రెడీ అవుతున్న అమెరికా.. హీటర్‌గా పనిచేస్తున్న బిట్‌కాయిన్ రిగ్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో శీతాకాలం దగ్గర పడుతుండగా, ఇళ్లలో వేడి కోసం వాడే హోమ్ హీటింగ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, ఎలక్ట్రిక్ ఫర్నేస్‌ల ప్రాధాన్యం పెరుగుతోంది. అయితే కొందరు అమెరికన్లు మాత్రం ఇళ్లను వేడిగా ఉంచుకోవడానికి కొత్త మార్గం వెతుకుతున్నారు. అదే క్రిప్టోకరెన్సీ మైనింగ్. సాధారణంగా మైనింగ్ సమయంలో భారీగా ఉత్పత్తి అయ్యే వేడి వృథాగా పోతుంటుంది. ఇప్పుడు ఆ వేడిని ఇళ్లను, ఆఫీసులను వేడి చేయడానికి ఉపయోగించే ప్రయత్నాలు మొదలయ్యాయి.

వివరాలు 

 "హీట్ ట్రియో" అనే పరికరం 

డిజిటల్ ఆస్తుల బ్రోకరేజ్ సంస్థ K33 చెప్పిన ప్రకారం, బిట్‌కాయిన్ మైనింగ్ పరిశ్రమ ఒక్క ఏడాదిలోనే దాదాపు 100 టెరావాట్-అవర్స్ హీట్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తోంది. ఇది మొత్తం ఫిన్లాండ్‌ను వేడి పెట్టడానికి సరిపోతుంది. ఇంత పెద్ద మొత్తంలో వృథా అవుతున్న ఉష్ణశక్తిని చలికాలంలో ఉపయోగించాలనే ఆలోచనతో కొంతమంది వ్యాపారవేత్తలు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇవాళ మార్కెట్లో ఇలాంటి ప్రయోగాల్లో భాగంగా "హీట్ ట్రియో" అనే పరికరం కూడా వచ్చింది. సుమారు 900 డాలర్ల ధర ఉన్న ఈ స్పేస్ హీటర్, బిట్‌కాయిన్ మైనింగ్ రిగ్‌గా కూడా పనిచేస్తుంది. కొందరు తమ ఇళ్లలో ఏర్పాటు చేసిన మైనింగ్ యంత్రాల నుంచే వచ్చే వేడితో మొత్తం ఇల్లు వేడిగా ఉంచుతున్నారు.

వివరాలు 

మైనింగ్‌ ద్వారా వేడి పొందడానికీ దాదాపు అంతే ఖర్చు

డల్లాస్‌లోని సస్టెయినబుల్ బిట్‌కాయిన్ మైనింగ్ సంస్థ బిట్‌ఫోర్డ్ డిజిటల్ CEO జిల్ ఫోర్డ్ చెప్పినట్లు, కొందరి ఇళ్లలో అట్టిక్‌లో నిశ్శబ్దంగా నడుస్తున్న బిట్‌కాయిన్ రిగ్‌ల వేడిని వెంటిలేషన్ వ్యవస్థ ద్వారా ఇంటికి పంపుతున్నారు. అయితే ఈ విధానం నిజంగా ఆర్థికంగా లాభదాయకమా? అంటే ఇది పూర్తిగా స్థానికంగా ఉన్న విద్యుత్ రేట్లు, మైనింగ్ యంత్రాల వేగం మీద ఆధారపడి ఉంటుంది. సాధారణ హీటింగ్‌కి ఎంత వ్యయం అవుతుందో... మైనింగ్‌ ద్వారా వేడి పొందడానికీ దాదాపు అంతే ఖర్చు వస్తుందని నిపుణులు తెలిపారు. కానీ అదనంగా మీరు బిట్‌కాయిన్ కూడా మైన్ చేస్తున్నారన్నది ప్లస్ పాయింట్," అని ఫోర్డ్ చెప్పింది. పాత మోడల్‌ మైనింగ్ మెషీన్‌ అయినా, ఇల్లు వేడి పెట్టేందుకు సరిపోతుందనీ చెబుతున్నారు.

వివరాలు 

చిన్న ఇళ్ల కంటే పెద్ద పరిశ్రమల దగ్గరే ఇది అసలు ప్రయోజనం

ఇక పెద్ద స్థాయిలో — డేటా సెంటర్ల వంటి చోట్ల — ఈ ఆలోచన మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు ఆర్జెంటమ్ AI వ్యవస్థాపకుడు ఆండ్రూ సోబ్కో. కంప్యూటింగ్ పవర్ షేరింగ్ కోసం మార్కెట్ తయారు చేస్తున్న ఆయన మాట్లాడుతూ, "కంప్యూటింగ్‌లో ఉపయోగించిన దాదాపు మొత్తం ఎనర్జీ వేడి రూపంలోనే బయటకు వస్తుంది కాబట్టి, ఆ వేడిని వినియోగించడం తెలివైన ఆలోచన" అని చెప్పారు. అయితే చిన్న ఇళ్ల కంటే పెద్ద పరిశ్రమల దగ్గరే ఇది అసలు ప్రయోజనం ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనపై కొన్ని సందేహాలు కూడా ఎదురవుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్‌కు చెందిన ప్రొఫెసర్ డెరిక్ మోర్ మాత్రం ఈ విధానం పెద్దగా ప్రయోజనం ఇవ్వదనే అభిప్రాయంలో ఉన్నారు.

వివరాలు 

"సాఫ్ట్‌వార్మ్" బిట్‌కాయిన్ మైనింగ్ నుంచి వచ్చే వేడిని చలిని తగ్గించడానికి ఉపయోగిస్తుంది

"ఇప్పటి పరిస్థితుల్లో,ఒక ఇంట్లో ఉన్న సాధారణ కంప్యూటర్‌గానీ, ఇంటి నెట్‌వర్క్‌గానీ బిట్‌కాయిన్ బ్లాక్ మైన్ చేయడంలో ఉపయోగపడే అవకాశమే లేదు.పది ఏళ్ల క్రితం ఇంట్లో మైనింగ్ చేయడం కొంతవరకు సాధ్యమై ఉండొచ్చు, కానీ ఇప్పుడు కాదు,"అని ఆయన చెప్పారు. ఈలోపే కొంతమంది మాత్రం నిజంగా ఈ వేడి వినియోగాన్ని ఆచరణలో పెట్టేశారు. ఐడాహోలోని చాలిస్ ప్రాంతంలో కేడ్ పీటర్సన్ కంపెనీ "సాఫ్ట్‌వార్మ్" బిట్‌కాయిన్ మైనింగ్ నుంచి వచ్చే వేడిని చలిని తగ్గించడానికి ఉపయోగిస్తుంది. ప్రస్తుతం కొన్ని వ్యాపారసంస్థలు ఈసాఫ్ట్‌వార్మ్ రిగ్‌లను పరీక్షిస్తున్నాయి. ఉదాహరణకు,ఒక ఇండస్ట్రియల్ కాంక్రీట్ కంపెనీ తమ 2,500గ్యాలన్ల నీటి ట్యాంకు వేడి పెట్టడానికి నెలకు 1,000డాలర్లు ఖర్చవుతుండగా,ఇప్పుడు అదే పనిని బిట్‌కాయిన్ మైనింగ్ ఉత్పత్తి చేసే వేడితో చేస్తున్నట్లు చెబుతున్నారు.