LOADING...
Mappls: భారతదేశంలో స్వదేశీ నావిగేషన్ యాప్ 'Mappls': ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఫుల్ ప్రైవసీ.. ఫుల్ సేఫ్టీ..!
ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఫుల్ ప్రైవసీ.. ఫుల్ సేఫ్టీ..!

Mappls: భారతదేశంలో స్వదేశీ నావిగేషన్ యాప్ 'Mappls': ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఫుల్ ప్రైవసీ.. ఫుల్ సేఫ్టీ..!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2025
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

జోహో (Zoho) అరట్టై యాప్‌ తర్వాత,భారతదేశంలో డిజిటల్ ఆత్మనిర్భర్ (Atmanirbhar) తత్త్వానికి అనుగుణంగా కొత్తగా MapmyIndia సంస్థ రూపొందించిన స్వదేశీ నావిగేషన్ యాప్ 'Mappls' వచ్చేసింది 11 అక్టోబర్ నాటి ఒక డ్రైవ్ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ యాప్‌ని పరీక్షించారు. ఈ సందర్భంగా, 3D జంక్షన్ వ్యూస్, వాయిస్ గైడ్ డైరెక్షన్స్, లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ వంటి నావిగేషన్, భద్రతా ఫీచర్లను ఆయన హైలైట్ చేశారు. న్యూఢిల్లీ ఆధారిత MapmyIndia సంస్థ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)తో కలిసి రూపొందించిన ఈ యాప్, గ్లోబల్ మ్యాపింగ్ సర్వీసెస్ (Google Maps)కు భిన్నమైన, ప్రైవసీ-ఫోకస్ చేసిన హైపర్ లోకల్ అల్టర్నేటివ్‌ను భారత యూజర్లకు అందిస్తుంది.

వివరాలు 

Mappls అంటే ఏమిటి? 

Mappls అనేది MapmyIndia రూపొందించిన స్వదేశీ డిజిటల్ నావిగేషన్, మ్యాపింగ్ యాప్. ఇది వినియోగదారులకు ఖచ్చితమైన అడ్రసులు కనుగొనడానికి, స్టెప్-బై-స్టెప్ డ్రైవింగ్ డైరెక్షన్స్ పొందడానికి, లైవ్ ట్రాఫిక్, భద్రతా సమాచారం తెలుసుకోవడానికి సహాయపడుతుంది. భారత-specific డేటా, రోడ్లు, వాతావరణం కోసం ప్రత్యేకంగా రూపొందించిన మ్యాపింగ్ టూల్స్ కూడా అందిస్తుంది. ISRO Mappls యాప్‌తో ఎలా పని చేస్తుంది? ఫిబ్రవరి 2021లో, MapmyIndia ISROతో భాగస్వామ్యం చేయడం ద్వారా, ISRO ఉపగ్రహ ఇమేజింగ్, భూఅవలోకన డేటా తో కలిపి Mappls యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఖచ్చితమైన, స్థానికంగా సబలమైన మ్యాపింగ్ సొల్యూషన్స్ అందించబడతాయి. దీనివల్ల యాప్ కవరేజ్, ఖచ్చితత్వం మెరుగవుతుంది.

వివరాలు 

యాప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? 

Mappls యాప్ mappls.com,Google Play Store లేదా Apple App Store ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Android Auto,Apple CarPlayనూ సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లు,వెబ్ బ్రౌజర్లు లేదా కార్ ఇన్‌సిస్టమ్ ద్వారా మ్యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు. Mappls ముఖ్య ఫీచర్లు: 3D జంక్షన్ వ్యూ (Junction View): వేరు వేరు నగరాల్లో ఉన్న కాంప్లెక్స్ ఫ్లైవోవర్స్ లేదా మల్టీ-లేన్ జంక్షన్లను డ్రైవ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది.Mappls 3D జంక్షన్ వ్యూ ద్వారా లేన్‌లను స్పష్టంగా చూపిస్తుంది.ఓవర్‌బ్రిడ్జిలు,అండర్‌పాస్‌లు లేదా మల్టీ-లేన్ కూడళ్ల గుండా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ ఫీచర్ 3డీ వ్యూ, ఫోటో-రియలిస్టిక్ వ్యూ అందిస్తుంది. ఈ ఫీచర్ వెళ్లే రోడ్లు అస్పష్టంగా ఉన్న ప్రాంతాలలో అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

వివరాలు 

లైవ్ ట్రాఫిక్ సిగ్నల్ టైమర్స్ (Live Traffic Intelligence):

రియల్ టైమ్ ట్రాఫిక్ సమాచారం, రోడ్ స్పీడ్ లిమిట్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, లైవ్ సిగ్నల్ టైమర్లు, స్పీడ్ కెమెరా లొకేషన్లు Mappls చూపిస్తుంది. దీని ద్వారా యూజర్లు స్మూత్,సేఫ్ జ‌ర్నీ ప్లాన్ చేయవచ్చు. టోల్ సేవింగ్స్, రూట్ ఆప్టిమైజేషన్ (NHAI Toll Savings Calculator): టోల్ ఛార్జ్ లను అంచనా వేయడం, టోల్ పాసుల వివరాలు, ప్రీ-క్యాల్క్యులేషన్ ద్వారా Mappls యూజర్లకు ముందస్తు ప్లానింగ్ సులభం చేస్తుంది. లోకల్ లాంగ్వేజీ సపోర్టు: Mappls యాప్‌లో 9 భారతీయ భాషల్లో - హిందీ, తమిళ్, తెలుగు, బెంగాలీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, గుజరాతీ - నావిగేషన్, మ్యాప్ లేబుల్స్, వాయిస్ గైడెన్స్ ఉన్నాయి.

వివరాలు 

Mappls Camera:

లొకేషన్స్ రికార్డు చేయడానికి ఇంటిగ్రేటెడ్ కెమెరా ఉంది. ఫోటో తీసి QR కోడ్ సృష్టించవచ్చు, తద్వారా తరువాత షేర్ చేయడం, తిరిగి వెళ్లడం సులభం అవుతుంది. Speed Camera & Traffic Monitoring: వీధుల్లో ఉన్న స్పీడ్ కెమెరా,ట్రాఫిక్ సిగ్నల్స్, మానిటరింగ్ పాయింట్ల గురించి Mappls అప్డేట్స్ ఇస్తుంది. Safety Alerts: రియల్ టైమ్‌లో Mappls యాప్ డ్రైవర్‌కి గుంతలు, షార్ప్ టర్న్స్,స్పీడ్ బ్రేకర్స్ వంటి రోడ్డు ప్రమాద సూచనలను తెలియజేస్తుంది,ఇది సురక్షితంగా డ్రైవ్ చేయడంలో సహాయపడుతుంది. DigiPin Integration: భారత పోస్టు డిజిటల్ అడ్రెసింగ్ సొల్యూషన్ DigiPin తో ఇంటిగ్రేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వెరిఫైడ్,స్టాండర్డైజ్డ్ అడ్రసులు అందుతాయి. Mappls Pin: ప్రతి లొకేషన్‌కు 6-అక్షరాల అల్ఫాన్యూమరిక్ కోడ్ (Mappls Pin) ఉంటుంది.

వివరాలు 

3D Metaverse & RealView:

360 డిగ్రీ RealView మ్యాప్స్, VR హెడ్సెట్ సపోర్ట్, జియో-ట్యాగ్, మేజరింగ్, వీఆర్ ఇన్‌పుట్ ద్వారా ఇంపాక్ట్ఫుల్ డేటా అనాలిసిస్ చేసుకోవచ్చు. ప్రైవసీ & డేటా హ్యాండ్లింగ్: వీటిలో ఉన్న యూజర్ డేటా పూర్తి భద్రతతో భారత సర్వర్‌లలోనే స్టోర్ అవుతుంది. డేటా ఎక్కడా ఎగుమతి చేయబడదు.

వివరాలు 

Mappls ఎవరు ఉపయోగించగలరు? 

వ్యక్తిగత వినియోగం, వ్యాపారాలు, ప్రభుత్వ ఏజెన్సీల కోసం Mappls ఉపయోగపడుతుంది. ఫ్లీట్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనాలిసిస్ వంటి విభిన్న అవసరాలకు కూడా అనుకూలంగా ఉంటుంది.