LOADING...
Android: 'ఇది ఎమర్జెన్సీ కాల్'.. స్క్రీన్‌పైనే చూపించే ఆండ్రాయిడ్ కొత్త ఫీచర్
'ఇది ఎమర్జెన్సీ కాల్'.. స్క్రీన్‌పైనే చూపించే ఆండ్రాయిడ్ కొత్త ఫీచర్

Android: 'ఇది ఎమర్జెన్సీ కాల్'.. స్క్రీన్‌పైనే చూపించే ఆండ్రాయిడ్ కొత్త ఫీచర్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2025
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆండ్రాయిడ్ వినియోగదారులకు త్వరలోనే కొత్త ఉపయోగకరమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది. "ఫోన్ బై గూగుల్" యాప్‌లో 'కాల్ రీజన్' (Call Reason) అనే ఫీచర్‌ను గూగుల్ బీటా టెస్టింగ్‌గా ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా చేసే కాల్‌కు 'అత్యవసరం' అనే గుర్తు పెట్టవచ్చు. అలా మార్క్ చేసిన కాల్, రిసీవర్ ఫోన్‌కు వచ్చినప్పుడు స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ వారు కాల్‌ మిస్ అయితే, అదే వివరాలు కాల్ హిస్టరీలోనూ కనిపిస్తాయి. అయితే ఇది ఫోన్‌లో ముందే సేవ్ చేసి ఉన్న కాంటాక్ట్‌లతోనే పనిచేస్తుంది. అంతేకాదు, కాల్ చేసే వ్యక్తి, కాల్ స్వీకరించే వ్యక్తి ఇద్దరూ కూడా తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో గూగుల్ డిఫాల్ట్ 'ఫోన్' యాప్‌నే ఉపయోగిస్తుండాలి.

వివరాలు 

'అత్యవసరం' అనే ఒక ఆప్షన్ మాత్రమే

ముఖ్యంగా తరచూ కాల్స్ ఎత్తని స్నేహితులు లేదా వాయిస్ మెయిల్‌లోకి వెళ్లే కాల్‌లను చేసే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడనుంది. ప్రత్యేకంగా మెసేజ్ పంపాల్సిన అవసరం లేకుండా కాల్ ఎంత ముఖ్యమో ముందే తెలియజేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 'అత్యవసరం' అనే ఒక ఆప్షన్ మాత్రమే ఉంది. భవిష్యత్తులో కాల్‌ కారణాన్ని వివరించే కస్టమ్ మెసేజ్‌లు లేదా ఎమోజీలు వంటి మరో ఫీచర్లు కూడా జోడించే అవకాశముందని సమాచారం. ఈ మెసేజ్ కాల్ హిస్టరీలో కనిపించడం వల్ల, మిస్ అయిన ముఖ్యమైన కాల్‌లను తిరిగి గుర్తుచేసే రిమైండర్‌లాగానూ ఇది పనిచేస్తుంది.

వివరాలు 

 ఫీచర్ బీటా రూపంలో విడతలవారీగా విడుదల

ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా రూపంలో విడతలవారీగా విడుదలవుతోంది. ఫోన్ బ్రాండ్‌ను బట్టి ఈ ఫీచర్ అందరికీ వెంటనే అందుబాటులోకి రావచ్చు లేదా రావకపోవచ్చు. ఈ అప్‌డేట్ మీ ఫోన్‌లో ఉందా లేదా తెలుసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్‌లో మీ ప్రొఫైల్‌పై ట్యాప్ చేసి 'మ్యానేజ్ ఆప్స్ అండ్ డివైసెస్' → 'చెక్ ఫర్ అప్‌డేట్స్'కి వెళ్లాలి. అలాగే సెట్టింగ్స్‌లో 'యాప్స్' → 'డిఫాల్ట్ యాప్స్'లోకి వెళ్లి, మీరు 'ఫోన్ బై గూగుల్' యాప్‌ను వాడుతున్నారా లేదా కూడా తనిఖీ చేసుకోవచ్చు

Advertisement