Page Loader
CMF Phone 2 Pro : నథింగ్ నుండి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్.. లాంచ్‌కి ముందే ప్రైస్ రివీల్!
నథింగ్ నుండి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్.. లాంచ్‌కి ముందే ప్రైస్ రివీల్!

CMF Phone 2 Pro : నథింగ్ నుండి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్.. లాంచ్‌కి ముందే ప్రైస్ రివీల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 23, 2025
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో శుభవార్తే. నథింగ్ కంపెనీ సబ్-బ్రాండ్ అయిన CMF నుంచి త్వరలోనే కొత్త మోడల్ 'CMF Phone 2 Pro' భారతీయ మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే ఫోన్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫీచర్లు బయటపడ్డాయి. తాజా సమాచారం మేరకు ఈ ఫోన్ ఏప్రిల్ 28న లాంచ్ కానుంది.

Details

లాంచ్‌కు ముందే ధర లీక్ 

ఈ ఫోన్ రెండు వేరియంట్లలో రానుందని సమాచారం. 8GB RAMతో కూడిన 128GB మోడల్ ధర దాదాపు రూ. 18,999గా ఉండొచ్చని అంచనా. అదే 256GB వేరియంట్ ధర సుమారు రూ.20,999గా ఉండే అవకాశం ఉంది. గతంలో వచ్చిన CMF Phone 1 ధర 128GB వేరియంట్‌కు రూ,15,999, 256GB వేరియంట్‌కు రూ.17,999గా ఉంది. ముఖ్యమైన ఫీచర్లు ఇవే CMF Phone 2 Pro మోడల్ మిడ్-రేంజ్ బడ్జెట్ సెగ్మెంట్‌లో వస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్ వాడనున్నారు. 6.7 అంగుళాల AMOLED ఫుల్ HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్టుతో వచ్చిన ఈ డివైస్ దృశ్యానుభవాన్ని మెరుగుపరుస్తుంది.

Details

ఆండ్రాయిడ్ 15తో రన్ అవుతుంది 

ఫోన్ బాక్స్ వెలుపల ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. 50MP ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ అలాగే 5000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది ఎక్కువ సమయం బ్యాటరీ బ్యాకప్ కల్పిస్తుంది. ఫోటోగ్రఫీకి ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్ కావచ్చు. CMF Phone 2 Pro మోడల్ ఇప్పుడు మిడ్-రేంజ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ వినియోగదారులకు స్టైలిష్ లుక్‌తోపాటు పవర్‌ఫుల్ ఫీచర్లను అందించనుంది.