Anthropic: ఆంత్రోపిక్ సంచలన నిర్ణయం.. ఆ ఏఐ మోడల్‌పై కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కీలక సంస్థ ఆంత్రోపిక్ తన తాజా ఏఐ మోడల్ "మైథోస్"ను విడుదల చేయబోమని ప్రకటించింది. ఈ మోడల్ సామర్థ్యాలు అత్యంత శక్తివంతంగా ఉండటంతో పాటు, ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్‌లు, వెబ్ బ్రౌజర్లలో ఉన్న భద్రతా లోపాలను గుర్తించే సామర్థ్యం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. కంపెనీ ప్రకారం, "క్లాడ్ మైథోస్ ప్రివ్యూ" సామర్థ్యాలు బాగా పెరగడంతో దాన్ని సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం సురక్షితం కాదని భావించింది.
వివరాలు
వర్చువల్ భద్రత కోసమే అలా..
మైథోస్ మోడల్ వర్చువల్ సాండ్‌బాక్స్ నుంచి బయటకు రావడానికి సూచనలు అనుసరించే సామర్థ్యం కూడా కలిగి ఉందని ఆంథ్రోపిక్ వెల్లడించింది. ఇది భద్రతా పరంగా ప్రమాదకరమని నిపుణులు భావిస్తున్నారు. ఒక సందర్భంలో పరిశోధకుడు ఈ మోడల్‌ను సాండ్‌బాక్స్ నుంచి బయటపడితే సందేశం పంపమని సూచించగా, మైథోస్ విజయవంతంగా అనూహ్యంగా ఇమెయిల్ పంపింది. ఆ సమయంలో పరిశోధకుడు బయట ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన అందర్నీ షాకింగ్‌కు గురిచేసింది.
వివరాలు
27 ఏళ్ల పాత లోపాన్ని గుర్తించిన ఏఐ
మైథోస్ గుర్తించిన అన్ని భద్రతా లోపాల వివరాలను ఆంథ్రోపిక్ వెల్లడించకపోయినా, కొన్ని విషయాలు వెల్లడించింది. అత్యంత భద్రత కలిగిన ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఒకటైన OpenBSDలో 27 ఏళ్ల పాత లోపాన్ని ఈ ఏఐ గుర్తించింది. అంతేకాకుండా, భద్రతా నైపుణ్యం లేని ఇంజనీర్లు కూడా మైథోస్‌ను ఉపయోగించి రాత్రికి రాత్రే రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ లోపాలను గుర్తించి, పూర్తి ఎక్స్‌ప్లాయిట్‌ను సిద్ధం చేయగలిగినట్లు కంపెనీ తెలిపింది.
వివరాలు
పరిమిత యాక్సెస్ మాత్రమే
మైథోస్ మోడల్‌ను పూర్తి భద్రతా చర్యలు అమలు చేసిన తర్వాతే విడుదల చేయాలని ఆంథ్రోపిక్ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ మోడల్‌కు కేవలం కొద్ది సంస్థలకే యాక్సెస్ ఇస్తోంది. అందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీస్, NVIDIA, JPMorgan Chase వంటి సంస్థలు ఉన్నాయి. "ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్" పేరుతో సాగుతున్న ఈ సైబర్ సెక్యూరిటీ కార్యక్రమంలో భాగంగా, ఎంపిక చేసిన సంస్థలకు మైథోస్ వినియోగానికి 100 మిలియన్ డాలర్ల వరకు క్రెడిట్లు అందిస్తున్నట్లు ఆంథ్రోపిక్ తెలిపింది.