Loading...
Anthropic Claude Ship: ఏఐ కోడింగ్‌లో సరికొత్త విప్లవం.. క్లాడ్ షిప్‌ను లాంచ్ చేసిన ఆంత్రోపిక్‌!
ఏఐ కోడింగ్‌లో సరికొత్త విప్లవం.. క్లాడ్ షిప్‌ను లాంచ్ చేసిన ఆంత్రోపిక్‌!

Anthropic Claude Ship: ఏఐ కోడింగ్‌లో సరికొత్త విప్లవం.. క్లాడ్ షిప్‌ను లాంచ్ చేసిన ఆంత్రోపిక్‌!

వ్రాసిన వారు Balachander Sharma
Nov 24, 2026
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు ఏఐ టూల్స్ కోడ్ రాయడం, అందులోని తప్పులను గుర్తించడం వంటి పనులకు పరిమితమయ్యాయి. అయితే ఇప్పుడు కోడ్ రాయడమే కాదు.. దాన్ని పరిశీలించి, తప్పులను సరిచేసి, చివరకు ప్రాజెక్టులోకి తీసుకోవడానికి ఆమోదించే స్థాయికి ఏఐ చేరుకుంది. ఈ దిశగా ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) 'క్లాడ్ షిప్ (Claude Ship)' పేరుతో సరికొత్త టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కోడింగ్ ప్రక్రియలో కీలకమైన సమయాన్ని ఆదా చేయడమే దీని ప్రధాన లక్ష్యం.

Details

కోడ్ రివ్యూ నుంచి ఆమోదం వరకు ఏఐతోనే!

క్లాడ్ షిప్ ప్రత్యేకత కేవలం కోడ్‌లో తప్పులను గుర్తించడమే కాదు. డెవలపర్లు రాసిన కోడ్‌ను పరిశీలించడం, సమస్యలను గుర్తించడం, వాటిని సరిచేయడం, అవసరమైన అనుమతులు ఇవ్వడం వంటి పనులను ఏఐ ఏజెంట్లతో నిర్వహించవచ్చు.

ముఖ్యంగా ఒక కొత్త కోడ్ మార్పును ప్రాజెక్టులో కలపడానికి ముందు మనుషుల ఆమోదం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

డెవలప్‌మెంట్ టీమ్ ముందుగానే రూపొందించిన నిబంధనల ఆధారంగా కొన్ని కోడ్ మార్పులకు ఏఐ స్వయంచాలకంగా ఆమోదం కూడా ఇవ్వగలదు.

Details

మూడు విభాగాల్లో క్లాడ్ షిప్ సేవలు

ఈ కొత్త టూల్‌లో మూడు కీలక విభాగాలు ఉన్నాయి. మొదటిది కోడ్ రివ్యూ (Code Review). ఇది ఇప్పటికే అందరికీ అందుబాటులో ఉంది.

రెండోది పీఆర్ స్టీవార్డ్ (PR Steward). కోడ్‌లో సమస్యలు, CI చెక్స్ విఫలం కావడం, మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వంటి ఇబ్బందులను పరిష్కరించడంలో ఇది సహాయపడుతుంది.

కోడ్‌లో మార్పులు చేసిన ప్రతిసారీ వాటి వివరాలను తెలియజేయడంతో పాటు, అవసరమైతే తిరిగి పాత స్థితికి ఎలా తీసుకురావాలో కూడా సూచిస్తుంది.

మూడోది క్లాడ్ అప్రూవల్స్ (Claude Approvals). టీమ్ రూపొందించిన విధానాల ప్రకారం కోడ్ మార్పులకు ఆమోదం ఇస్తుంది.

ADVERTISEMENT

Details

డెవలపర్లకు సమయం ఆదా.. భద్రతకు ప్రాధాన్యం

ప్రస్తుతం ఏఐ ఏజెంట్లు తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో కోడ్‌ను రూపొందిస్తున్నాయి.

అయితే వాటిని పరిశీలించి, ఆమోదించి, వినియోగంలోకి తీసుకురావడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా క్లాడ్ షిప్‌ను ఆంత్రోపిక్ రూపొందించింది.

అయితే ఏఐ నిర్ణయాలపై వెంటనే పూర్తిస్థాయిలో ఆధారపడకుండా తొలుత పరిశీలన (Observe-only) విధానంలో ఉపయోగించాలని సంస్థ సూచించింది.

అవసరమైతే కీలకమైన మార్పులను మానవ నిపుణుల నిర్ణయానికి పంపే అవకాశం కూడా ఉంది.

ADVERTISEMENT

Details

గిట్‌హబ్‌తో అనుసంధానం.. ప్రస్తుతం బీటా దశలో

ప్రస్తుతం క్లాడ్ షిప్ సేవలను గిట్‌హబ్ (GitHub) రిపాజిటరీల కోసం క్లాడ్ టీమ్, ఎంటర్‌ప్రైజ్ ప్లాన్లలో అందిస్తున్నారు.

ఇందులో పీఆర్ స్టీవార్డ్, క్లాడ్ అప్రూవల్స్ సేవలు బీటా దశలో ఉండగా, కోడ్ రివ్యూ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంది.

క్విక్, స్టాండర్డ్, డీప్ వంటి రివ్యూ విధానాలను ఎంచుకోవచ్చు. నెలవారీ ఖర్చుల పరిమితులను కూడా నిర్ణయించుకోవచ్చు.

మొత్తంగా కోడ్ రాయడం నుంచి దాన్ని విడుదల చేయడానికి సిద్ధం చేసే వరకు ఏఐ పాత్రను విస్తరించే ప్రయత్నంగా క్లాడ్ షిప్ నిలుస్తోంది.

ADVERTISEMENT