LOADING...
Mrinank Sharma: 'ప్రపంచం ప్రమాదంలో ఉంది'.. ఆంత్రోపిక్ ఏఐ టాప్ ఇంజినీర్ మృణాంక్ రాజీనామా
'ప్రపంచం ప్రమాదంలో ఉంది'.. ఆంత్రోపిక్ ఏఐ టాప్ ఇంజినీర్ మృణాంక్ రాజీనామా

Mrinank Sharma: 'ప్రపంచం ప్రమాదంలో ఉంది'.. ఆంత్రోపిక్ ఏఐ టాప్ ఇంజినీర్ మృణాంక్ రాజీనామా

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2026
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఏఐ సంస్థ ఆంత్రోపిక్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సంస్థ రూపొందించిన తాజా ఏఐ టూల్‌ ఐటీ రంగంలోని ఉద్యోగాలకు సవాల్‌గా మారుతుందన్న చర్చ నడుస్తున్న వేళ, సంస్థకు చెందిన కీలక ఉద్యోగి ఒకరు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఆంత్రోపిక్‌లో సేఫ్‌గార్డ్ రీసెర్చ్ టీమ్‌ను నేతృత్వం వహించిన మృణాంక్ శర్మ(Mrinank Sharma) తన పదవికి వీడ్కోలు పలికినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

వివరాలు 

సంస్థలో చేరినప్పుడు పెట్టుకున్న లక్ష్యాలను పూర్తిగా సాధించా: మృణాంక్

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. ప్రపంచం ప్రస్తుతం తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని, ఆ ప్రమాదం ఏఐ వల్ల మాత్రమే కాకుండా బయో వెపన్స్ కారణంగానూ కాదని, పరస్పరం అనుసంధానమైన అనేక సంక్షోభాలే అసలైన ముప్పుగా మారాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయిలో మన అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తాను ఆంథ్రోపిక్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నానని,సంస్థలో చేరినప్పుడు పెట్టుకున్న లక్ష్యాలను పూర్తిగా సాధించానని మృణాంక్ తెలిపారు. పీహెచ్‌డీ పూర్తైన వెంటనే ఏఐ సేఫ్టీ రంగంలో పని చేయాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం శాన్‌ఫ్రాన్సిస్కోకు వచ్చానని,ఇక్కడ ఏఐ రంగంలో తాను చేసిన కృషిపై సంతృప్తిగా ఉన్నానని ఆయన వెల్లడించారు.

వివరాలు 

కవిత్వంలో డిగ్రీ

ఇక తన భవిష్యత్ ప్రణాళికలపై కూడా మృణాంక్ స్పందించారు. ఇకపై కవిత్వంపై దృష్టి పెట్టాలని, ఆ రంగంలో డిగ్రీ కూడా సాధించాలని భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆంథ్రోపిక్ సంస్థ ఇటీవలే **Claude Opus 4.6**ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఏఐ సంస్థ మార్కెట్ విలువ సుమారు 350 బిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా వేస్తున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మృణాంక్ శర్మ చేసిన ట్వీట్ 

Advertisement