ఇండియాలో మొదటి ఆపిల్ రిటైల్ స్టోర్ ని ప్రారంభిస్తున్న టిమ్ కుక్, స్టోర్ విశేషాలివే
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం ఆపిల్ ఇన్ కార్పోరేషన్, ఇండియాలో తన మొట్టమొదటి రిటైల్ స్టోర్ ని ప్రారంభిస్తోంది. ఈరోజు ఉదయం 11గంటలకు ముంబైలో ఆపిల్ సీఈవో చేతుల మీదుగా టిమ్ కుక్ ప్రారంభిస్తున్నారు.
ముంబైలోని బాంద్రాలోని కుర్లా కాంప్లెక్స్ లో ఈ స్టోర్ ని ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు టిమ్ కుక్ ఆల్రెడీ ముంబై చేరుకున్నారు టిమ్ కుక్. మొత్తం ఇండియాలో రెండు రిటైల్ స్టోర్ లను ప్రారంభించాలని ఆపిల్ అనుకుంది.
అందుకే గురువారం రోజు ఢిల్లీలోని సాకేత్ లో మరో రిటైల్ స్టోర్ ని ప్రారంభిస్తోంది ఆపిల్ సంస్థ. ఇండియాలో ఆపిల్ సంస్థ సేవలు మొదలై 25సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ స్టోర్స్ ని ప్రారంభిస్తోంది ఆపిల్ సంస్థ.
Details
ప్రధాని మోదీని కలవనున్న టిమ్ కుక్
బాంద్రాలోని ఆపిల్ స్టోర్ లో 100మంది ఉద్యోగస్తులు ఉంటారు. 20భాషల్లో సేవలందిస్తారని ఆపిల్ తెలియజేసింది. ఈ స్టోర్ ని మహారాష్ట్ర సంస్కృతి ఉట్టిపడే విధంగా తయారు చేసారట.
స్టోర్ పనులు జరుగుతుండగా, ఆల్రెడీ ముంబైకి వచ్చిన సీఈవో టిమ్ కుక్, బాలీవుడ్ సెలెబ్రిటీలను కలిసాడు. మాధురీ దీక్షిత్ తో కలిసి దిగిన ఫోటోలు ఇంటర్నెట్ లో కనిపించాయి.
ముంబైలోని ఫేమస్ ఫుడ్ వడాపావ్ ని రుచి చూసాడు కుక్. ప్రస్తుతం ముంబైకి చేరుకున్న కుక్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని, టాటా సన్స్ ఛైర్మన్ ని కలవబోతున్నాడు. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీని టిమ్ కుక్ కలవబోతున్నాడు.