LOADING...
Apple: ఐఫోన్ కోసం ప్రత్యేకంగా ఆపిల్ నుంచి కొత్త స్టైలిష్ బ్యాగ్ !
ఐఫోన్ కోసం ప్రత్యేకంగా ఆపిల్ నుంచి కొత్త స్టైలిష్ బ్యాగ్ !

Apple: ఐఫోన్ కోసం ప్రత్యేకంగా ఆపిల్ నుంచి కొత్త స్టైలిష్ బ్యాగ్ !

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ ఆపిల్, ఇప్పుడు కొత్తగా "iPhone Pocket" అనే ఆకర్షణీయమైన ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది ఒక నూలుతో నేసిన చిన్న బ్యాగ్, దీని ద్వారా ఏ మోడల్ ఐఫోన్ అయినా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఫోన్‌తో పాటు రోజువారీ చిన్న వస్తువులు పెట్టుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. ఈ యూనిక్ డిజైన్‌కు ప్రేరణగా "ఒక బట్ట ముక్క" ఆలోచన తీసుకున్నట్లు ఆపిల్ తెలిపింది. ఈ ఉత్పత్తి రెండు వెర్షన్లలో లభిస్తుంది. ఒకటి క్రాస్‌బాడీ బ్యాగ్ రూపంలో, దీని ధర $229.95 (సుమారు ₹20,350). మరొకటి చిన్న వెర్షన్, దీని ధర $149.95 (సుమారు ₹13,300)గా ఉంది.

వివరాలు 

జపాన్ డిజైనర్ ఇస్సే మియాకేతో కలసి రూపకల్పన

ఈ "iPhone Pocket"ను ఆపిల్, ప్రసిద్ధ జపాన్ డిజైనర్ ఇస్సే మియాకేతో కలిసి లిమిటెడ్ ఎడిషన్‌గా డెవలప్ చేసింది. క్రాస్‌బాడీ మోడల్ నీలం, గోధుమ, నలుపు రంగుల్లో లభిస్తుండగా, చిన్న వెర్షన్ నారింజ, పసుపు, ఊదా, గులాబీ, టర్కాయిస్ వంటి చురుకైన రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీన్ని భుజంపై వేసుకోవచ్చు లేదా బ్యాగ్‌కు కట్టుకోవచ్చు. పూర్తిగా స్టైలిష్ & సౌకర్యవంతంగా ఉంటుంది.

వివరాలు 

నవంబర్ 14 నుంచి..

ఆపిల్ చెబుతున్నదేమిటంటే, ఈ డిజైన్ వారి తత్వానికి ప్రతిబింబం.. "అందరికీ సరిపోయే డిజైన్, అనేక విధాలుగా ఉపయోగపడే ఉత్పత్తి" అన్న భావనతో రూపొందించారట. ఈ కొత్త ఉత్పత్తి నవంబర్ 14 నుంచి ఆన్‌లైన్‌లో, అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఇటలీ, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, యుకేలలోని ఎంపిక చేసిన Apple Storesలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది.